ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన ‘కల్కి’ సినిమా ఇటీవల విడుదలైంది సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సినిమా విజయం సాధించడంతో రాజశేఖర్ సక్సెస్ అనుభవిస్తూ మీడియా తో సినిమా గురించి ముచ్చటించారు. భార్య జీవితా రాజశేఖర్ తో కలిసి రాజశేఖర్ ఇటీవల పాల్గొన్న మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రతి సమాధానానికి ఓపికగా సమాధానం చెప్పారు.


అయితే ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మాత్రం జీవితా రాజశేఖర్ సీరియస్ అయిపోయారు. కల్కి సినిమా దర్శత్వంలో మీరు జోక్యం చేసుకున్నారటగా అని ప్రశ్నించగా జీవిత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి మీడియాకు కొన్ని అంశాలు తెలియజేయాలనుకుంటున్నా. దాదాపు 20 కోట్ల పైగా బడ్జెట్ తో తాము ఈ చిత్రాన్ని నిర్మించామని జీవిత తెలిపింది. సినిమా నిర్మాతలమైన మాకు తెరకెక్కించే విధానం నచ్చాలి కదా.. ముందుగా కల్కి మూవీ చిత్ర యూనిట్ మొత్తానికి నచ్చితేనే 10 కోట్ల మంది ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది.


సినిమా గురించి తెలియని దాన్ని కాదు.. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాం. మేమెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను రూపొందించిన చిత్రాలు బాగా ఆడినా ఆడకపోయినా.. దర్శకత్వంలో నాకు పట్టు ఉన్న మాట వాస్తవం. నా అనుభవాన్ని ఎవ్వరూ కాదనలేరు. దీంతో సినిమా నిర్మించడంతో కచ్చితంగా సినిమాల్లో తమ జోక్యం ఉంటుందని డబ్బులు పెడుతున్నాను కాబట్టి సలహాలు సూచనలు డైరెక్టర్ కి ఇవ్వటం జరుగుతుందని...మీడియా పై సీరియస్ అయిపోయారు జీవిత రాజశేఖర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: