ఈ మద్య కొంతమంది హీరోయిన్లు పెళ్లికన్నా ముందు డేటింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు ఈ తరహా కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు.  విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్‌ హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలో మంచి పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది.  గత కొంత కాలంగా శృతిహాసన్‌ సినిమాలు చాలా తగ్గాయి. ముఖ్యంగా తెలుగు లో సినిమాలు లేవు. 


ఇటీవల తన ప్రియుడు కోర్సేల్‌తో చెట్టపట్టాలేసుకుని తిరిగిన విషయం తెలిసిందే.  వీరి ప్రేమ వ్యవహారం కమల్ హాసన్ కి కూడా తెలుసు.  ఒకదశలో వీరి వివాహం జరిగిపోతుందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి బ్రేకప్ చేప్పేసుకున్నారు.  బాయ్‌ఫ్రెండ్‌ మైకేల్‌ కోర్సేల్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ హఠాత్తుగా బ్రేకప్ ఎందుకు చెప్పుకున్నారో కారణాలు తెలపలేదు ఏడాదికి పైగా నటించకుండా ఉన్న ఆమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది. 

తాజాగా ఒక అభిమాని ట్విట్టర్‌లో ఆమె పెళ్లి విషయం ప్రస్తావించారు. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు? చెబితే అభిమానులమైన తామంతా పాల్గొంటామని అన్నాడు.  దానికి శృతి హాసన్ సమాధానమిస్తూ..నా పెళ్లి చూడాలంటే చాలా సమయం వేచి ఉండాలని..ముందు తన బర్త్ డే జరుపుకుందాం రండి! అని బదులిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: