టాలీవుడ్లో సీనియర్ హీరోలకు కొదవ లేదు. అయితే వారిని హీరోలుగా పెట్టి సినిమా తీసే వారు తక్కువ మందే ఉంటారు. అవకాశం ఇస్తే డాడీ పాత్రల్లోనో, మరో పాత్రల్లోనే తీసుకుంటామని అంటారు. మరి ఒక సీనియర్ హీరోకి మాత్రం ఎక్కడలేని డిమాండ్ వస్తోంది. ఇప్పటికీ టాప్ హీరోగానే సినిమాలు చేస్తున్నా ఆ హీరో అంటే యంగ్ డైరెక్టర్లు కూడా మోజు పడుతున్నారు.


ఆయనే నందమూరి బాలయ్య. బాలయ్య ప్రస్తుతం కే ఎస్ రవికుమార్ మూవీలో చేస్తున్నారు. ఇక బాలయ్య కోసం నలుగురు డైరెక్టర్లు కాచుకుని కూర్చున్నారు. వారిలో కల్కి మూవీని లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ ఒకరు. ఆయన తన నెక్స్ట్ మూవీ బాలయ్యతోనే అంటున్నాడు. వర్మ చెప్పిన స్టోరీ లైన్ నచ్చుకున్న బాలయ్య కూడా ఒకే అన్నాడట.


తొందరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని అంటున్నారు. ఇదే వరసలో వీవీ వినాయక్ మూవీ కి కూడా బాలయ్య ఓకే చెప్పాడని టాక్. ఈ మూవీకి స్టోరీ లైన్ బాలయ్య మొత్తానికి నచ్చుకున్నాడట. పరుచూరి బ్రదర్స్ తో ఇపుడు మేకప్ చేయించి మొత్తం స్టోరీని రెడీ చేస్తున్నారుట.


ఇక ఎఫ్ 2 డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో ఓ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడట. అదే విధంగా బోయపాటి ఎప్పటి నుంచో బాలయ్య కోసం వైటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. మొత్తానికి వంద సినిమాలు చేసిన ఈ సీనియర్ హీరో డిమాండ్ ఇలా అలా లేదుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: