టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాపీ డేస్ సినిమా తో వెండితెరకు పరిచయమైన హీరో నిఖిల్ అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కార్తికేయ, కేశవ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ తెచ్చుకున్న ఇండస్ట్రీ లో మంచి పేరు ఉన్న ప్రస్తుతం ఈ కుర్ర హీరో కి బ్యాడ్ టైం మామూలుగా లేదు.


గత సంవత్సరమే విడుదల కావాల్సిన అర్జున్ సురవరం ఇప్పటికీ కూడా రిలీజ్ కాలేదు...ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి కూడా క్లారిటీ లేదు. అసలు ఆ సినిమా గురించి ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అప్పటి నుండి స్టార్ట్ అయిన నిఖిల్ కి బ్యాడ్ టైం ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న శ్వాస సినిమా షూటింగ్ కూడా ఆగిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


ఈమధ్యనే మొదలైన శ్వాస సినిమా షూటింగ్ ఆగిపోవడం నిఖిల్ కే కాదు…విన్నవారందరికి షాక్. అయితే శ్వాస సినిమా షూటింగ్ ఇప్పటివరకు జరిగింది చూస్తే.. అది అనుకున్నట్టుగా రాకపోవడంతో శ్వాస సినిమా షూటింగ్ నిలిపివేసినట్టుగా టాక్. అసలే అర్జున్ సురవరం సినిమా విడుదల కాక బాధపడుతున్న హీరో నిఖిల్ కి ఇది పెద్ద షాకే. దీంతో నిఖిల్ కెరీర్ అటూ ఇటూ కాకుండా పోయింది. మరోపక్క కార్తికేయ 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో నిఖిల్ వున్నాడు. మరి ఈ సినిమా అయినా పూర్తి అవుతుందో లేదో. 





మరింత సమాచారం తెలుసుకోండి: