తెలుగు టెలివిజన్ రంగంలో వినూత్న ప్రయోగాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ఓంకార్.  అప్పటి వరకు రియాల్టీ షోలు అంటే పెద్దగా తెలియని తెలుగు ప్రేక్షకులకు ఎన్నో డ్యాన్స్ కాంపిటీషన్లతో, రియాల్టీ షో లతో ఓ ట్రెండ్ సృష్టించారు ఓంకార్.  తర్వాత దర్శకుడిగా మారి 'సయ్యాట’,‘జీనియస్’లాంటి సినిమాలు తీశారు. కానీ ఆశించిన ఫలితాలు మాత్రం పొందలేదు..దాంతో హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో ‘రాజుగారి గది’ సినిమా తీశారు. 

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది..వెంటనే కింగ్ నాగార్జున హీరోగా రాజుగారి గది 2 తీశారు.  ఈ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది.  తాజాగా మరోసారి హర్రర్ కాన్సెప్ట్ తో ‘రాజుగారి గది3’తెరకెక్కిస్తున్నారు.  ఇటీవల పూజ కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్ స్పీడ్ పెంచుతున్నారు అనుకునే లోపే మిల్కీ బ్యూటీ తమన్నా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాంతో బాలీవుడ్ బ్యూటీ తాప్సీని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇక తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ ఇప్పుడు ఏ తరహా సినిమాలకైనా ఓకే చెబుతుంది.  తాజాగా ‘రాజుగారి గది3’లో కాజల్ ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు హారర్ కాన్సెప్ట్ తో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొని కాజల్ ఈ సినిమాతో మెప్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కాకపోతే ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేయలేదు. మరి ఇదే నిజమైతే హర్రర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీలో కాజల్ ఎంత వరక మెప్పిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: