మెగాస్టార్ పదకొండేళ్ళ క్రితం రాజకీయ అరంగేట్రం చేశారు. ఆనాడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నపుడు హడావుడి అంతా ఇంతా కాదు. అక్కడ ఇంద్రుడిది కుర్చీ అయితే ఇక్కడ ఇంద్రసేనుడిది అగ్రాసనం అంటూ ఇంద్ర సినిమాలో భారీ డైలాగ్ చెప్పిన చిరంజీవి కన్ను అపుడే సీఎం కుర్చీ మీద పడిందని అంతా అనుకున్నారు. ఇక పార్టీ పెట్టడం, పోటీ చేయడం అంతా లాంచనమని కూడా ఫ్యాన్స్ వరకూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది.


ఇక తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రం మంత్రి పదవి కొన్నాళ్ళు అనుభవించిన చిరంజీవి ఆ తరువాత బుద్దిగా సినిమా రంగంలోకి తిరిగి వచ్చేశారు. 150వ సినిమాగా ఖైదీ నంబర్ 150 పేరుతో బంపర్ హిట్ కొట్టిన చిరు పట్టాలెక్కేశారు. ఆ తరువాత సైరా మూవీ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ కి ఆ మూవీ రిలీజ్ అవుతోంది. 


ఇక చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ కూడా అయనకు వల వేస్తోందని అంటున్నారు. చిరంజీవిని పార్టీలో చేరమని రాయబేరాలు వెళ్ళాయని అంటున్నారు.  అయితే చిరంజీవి ఇపుడు సైరా షూటింగులో బిజీగా ఉండడంతో ఆ తరువాత మాట్లాడుతానంటూ చెప్పారని కూడా అంటున్నారు. మరి సైరా రిలీజ్ కి మూడు నెలల సమయం ఉంది. చిరంజీవి ఆ తరువాత పొలిటికల్ రీ ఎంట్రీపై పెదవి విప్పుతారని చెబుతున్నారు.


చిరంజీవి రాజకీయాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది.  జాతీయ స్థాయిలో బలమైన బీజేపీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన బాట రాచ బాట అవుతుందా, చిరంజీవి నాయకత్వంలో బీజేపీకి ఏపీలో బలం వస్తుందా అన్నవి ఇపుడు పెద్ద ప్రశ్నలు, వీటికి మించి చిరంజీవి మళ్ళీ వస్తే జనం ఆదరిస్తారా అన్నది పెద్ద పాయింట్. మరి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: