బాలీవుడ్ హీరోయిన్ హాట్ హీరోయిన్స్ ల్లో ఇషా గుప్తా ఒకరు. 007 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న ఈ భామ 2012 లో 'జన్నత్ 2' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకూ డజను సినిమాల్లో నటించింది.  'వినయ విధేయ రామ' లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో స్టెప్పులు కూడా వేసింది.  ఇక సోషల్ మీడియాలో ఈ భామ సందడి సంగతి చెప్పనవసరం లేదు.


రెగ్యులర్ గా హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ వీలైనంతగా వేడిని పెంచడమే ఆమె విజన్.  అందుకు ఫోటో షూట్లు చేయడం ఆమె మిషన్.  మూడు రోజుల క్రితం పప్పీలతో ఫోటో షూట్ చేసింది.  పప్పీలు అనగానే మీరు ఉమ్మ.. అని ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు.  ఇవి కుక్కపిల్లలు.  అయితే పేరుకు పప్పీలతో ఫోటో షూటే కానీ అందాల ఆరబోతకు ఏమాత్రం లోటు చేయలేదు. వీ నెక్.. యూ నెక్ ను కలిపినట్టుగా పెద్ద ఫ్రంట్ విండో పెట్టడంతో ఈషా గుప్తా అందాలు బైటపడ్డాయి. 


ఒక ఫోటోలో బ్లాక్ కలర్ డ్రెస్ లోనూ మరో ఫోటోలో కలర్ ఫుల్ టాప్ తోనూ పోజిచ్చి పప్పీలను ఎత్తుకుని మరీ గ్లామరసం చిందించింది.  ఒకా ఫోటోకు 'లోలా' అని మరో ఫోటోకు 'జెర్రీ' అని క్యాప్షన్ ఇచ్చింది.  అంటే..అవి ఆ పప్పీల పేర్లు అయి ఉంటాయి.ఈషా ఫోటోల దెబ్బకు నెటిజన్లు వెర్రెత్తిపోయారు.  "కుక్కనైనా కాకపోతిని" అంటూ ఒకరు హిందీలో నిట్టూర్చారు.  "నెటిజన్స్: ఎండ్ గేమ్".. "కడక్ బ్యూటీ".. "కేర్ఫుల్.. కెఎల్ రాహుల్ చూస్తాడు".. "ఏక్ నంబర్ పోజ్" అంటూ కామెంట్లు పెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: