ఓటమి ఎరుగని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వరుస విజయాలతో దూసుకు పోతున్న స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ మద్య పూనేలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో రాంచరణ్ కాలికి గాయం కావడంతో కొంత కాలం విరామం తీసుకున్నారు.  ఇంతలోనే ఎన్టీఆర్ చేయికి గాయం అయ్యింది..ఆయన కూడా రెస్ట్ తీసుకున్నారు.  ప్రస్తుతం ఇద్దరూ కోలుకోవడంతో షూటింగ్ షరవేగంగా కానిచ్చేస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తాజాగా సినిమా గురించి అప్డేట్ అందించింది.  ఆ మద్య ఓ ప్రెస్ మీట్ లో మూవీ గురించి కొంత హింట్ ఇచ్చారు రాజమౌళి.  ఈ సినిమా ఇద్దరు మన్యం వీరుల గురించి చూపించబోతున్నారట. తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్, ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ల గురించి 1920 కాలం నాటి పరిస్థితుల గురించి చూపించబోతున్నట్లు తెలిపారు.  ప్రస్తుతం రాజమౌళి  వాషింగ్టన్ వెళ్లడంతో షూటింగ్ కు తాత్కాలిక విరామం ఇచ్చారు. 

రాజమౌళి యుఎస్ నుంచి తిరిగి రాగానే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక చిత్రయూనిట్ మరో ఆసక్తికర అంశాన్ని కూడా పేర్కొంది.నేడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతా రామరాజు జయంతి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆయన్ని గుర్తు చేసుకుంది. యంగ్ అల్లూరిగా రాంచరణ్ లుక్ ని చూపించేందుకు ఎంతో ఆసక్తిగా  ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాకపోతే ఫస్ట్ లుక్ ఎప్పుడు చూపిస్తారో అన్న విషయం మాత్రం తెలపలేదు.  కాకపోతే ఆగష్టు 15న అభిమానులకు ఏదో ఒక సర్ ప్రైజ్ ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: