రూహి సింగ్  పేరు ఉన్నారా .. బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించింది. మథుర్ భండార్కర్ తెరకెక్కించిన 'క్యాలెండర్ గర్ల్స్' చిత్రంలో ఒక హీరోయిన్.  తర్వాత ఒకటి అరా సినిమాల్లో నటించింది కానీ అవేమీ చెప్పుకోదగ్గవి కాదు.  'స్పాట్ లైట్ 2' అనే వెబ్ సీరిస్ లో కుడా నటించింది.  అసలే మోడలింగ్ నేపథ్యం కదా.. హాట్ నెస్ ను.. ఘాటు ఎక్స్ ప్రెషన్స్ ను కలిపి రంగరించి ఫోటోషూట్లు చేస్తుంది.  సోషల్ మీడియాలో మంటలు పెట్టే స్పెషలిస్టులలో ఒకరు.


ఈ భామ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలలో ఒకదానికి "స్పైసీ మామి..  హాట్ టమలి మిర్చి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ లో ఎక్కువ మందికి తెలియని పదం ఏదైనా ఉంది అంటే అది 'టమలి'.  అదో మెక్సికన్ డిష్.  మరో ఫోటో క్యాప్షన్ లో తనను తాను 'బ్యాడాస్' అని డిక్లేర్ చేసింది.  దానికి తగ్గట్టే అందాలను ఆరబోసింది.


ఎల్లో కలర్ టాప్.. బటన్ పెట్టుకోకుండా వదిలేసిన డెనిమ్ షార్ట్ స్టైలిష్ గా ఉన్నాయి. నాభి అందాల ప్రదర్శనను ఏ మాత్రం అడ్డుకోని ఆ పసుపు రంగు విండో స్టైల్ టాప్ కు నెటిజన్లు ఓ థ్యాంక్స్ చెప్పుకోవాలి.  ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "మిర్చీ లగీ హై".. "స్టన్నింగ్లీ బ్యూటిఫుల్".. "కర్లీ హెయిర్.. మెస్మరైజింగ్ నేవల్".. "ఉఫ్.. క్యా అదా హై".. "సూపర్ డూపర్ హాట్" అంటూ కామెంట్లు పెట్టారు.  ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'ఆపరేషన్ కోబ్రా' అనే ఒక వెబ్ సీరీస్ లో నటించేందుకు రెడీ అవుతోందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: