Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 8:19 pm IST

Menu &Sections

Search

రెండు సిమ్‌లు ఉన్న ఫోన్ నుంచి వ‌చ్చిన ఐడియా - డైమండ్ ర‌త్న‌బాబు

రెండు సిమ్‌లు ఉన్న ఫోన్ నుంచి వ‌చ్చిన ఐడియా - డైమండ్ ర‌త్న‌బాబు
రెండు సిమ్‌లు ఉన్న ఫోన్ నుంచి వ‌చ్చిన ఐడియా - డైమండ్ ర‌త్న‌బాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక మ‌నిషికి రెండు బుర్ర‌లుంటే ఎలా ఉంటుంది. ఆ వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న న‌డ‌వ‌డిక ఏ విధంగా ఉంటుంద‌నే క‌థాంశంతో తెర‌కెక్కుతున్న చిత్రం బుర్ర‌క‌థ‌. ఆది సాయికుమార్‌, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరోహీరోయిన్లుగా దీపాల ఆర్ట్స్‌, టఫెండ్‌ స్టూడియోస్‌ లిమిటెడ్‌ బేనర్లపై ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మాతలు శ్రీకాంత్‌ దీపాల, కిషోర్‌, కిరణ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. జులై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా  డైమండ్ ర‌త్న‌బాబు చిత్రం గురించి మీడియాతో ముచ్చ‌టించారు.


మీ జ‌ర్నీ ఎలా మొద‌లైంది...
నేను విజయవాడ హాస్యానందం పత్రికలో సబ్ఎడిటర్ గా నా జర్నీ స్టార్ట్ అయ్యింది అక్కడినుండి చింతపల్లి రమణ గారి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేరాను. ఆ సమయంలో 'దేవదాస్' 150 రోజులు ఆడింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహం తో రైటర్ గా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆతరువాత సీమశాస్రి సినిమాకు స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా, ఆతరువాత ఎస్వి కృష్ణారెడ్డి,నాగేశ్వర్ రెడ్డి గారితో వర్క్ చేసి రవికుమార్ చౌదరి గారితో ' పిల్లానువ్వు లేని జీవితం' ఆ తరువాత మోహన్ బాబు గారి కాంపౌండ్ లో ఆడో రకం ఈడోరకం ,గాయత్రి ,పాండవులు పాండవులు తుమ్మెద లాంటి మంచి సినిమాలకు స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది. ఆ తరువాత దర్శకుడు అవుదామని ప్రయత్నాలు మొదలు పెట్టాను.


బుర్ర కథ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వడం ఎలా ఉంది...
 చాలా ఆనందం గా ఉంది. నేను దర్శకుడిని అయ్యానన్న ఉత్సాహం తో, అలాగే నా కల సాధించానన్న నమ్మకంతో నా చేతి మీద డైరెక్టర్ అని పచ్చ బొట్టు వేయంచు కున్నాను. 


డైమండ్ అని పేరు ఎలా వచ్చింది...
 నేను చిన్నప్పటి నుండి కవితలు ఆ పేరుతోనే రాస్తుండేవాడిని. కవితా ఘోస్ట్ లో ఇదే పేరుతో చాలా కవిత్వాలు రాశాను. అలా నా కలం పేరు డైమండ్ గా మారి డైమండ్ రత్నబాబు గా ఇండస్ట్రీ కి వచ్చాను. 


మీరు క‌థ‌ల‌ను ఏ విధంగా తీసుకుంటారు?
నాకు హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలు చూసి కథలు రాయడం నచ్చదు. ఒక సంవత్సరం పాటు కష్టపడి కథ రాసి సినిమా విడుదలయ్యాక ఇదిహాలీవుడ్ సినిమా కథ కదా అంటే ఆ కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకని నేను చాలా స్ట్రిక్ట్ గా అనుకుని ఆ సినిమాలు చూసి ఇన్స్ పైర్అయ్యి కథలు రాయొద్దు అని నాకలంమీద ఒట్టువేసుకున్నాను. రామాయణం మహాభారతం లో చాలా కథలు ఉన్నాయివాటిని ఆధారం చేసుకొని ఈ కథ రాసుకున్నాను. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే నేను పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నపుడు చాలా మందిని అబ్సర్వ్ చేసాను వాటిలోంచి కొన్ని పాత్రలు తీసుకుంటాను.


బుర్ర కథ ఎలా ఇన్స్పైర్ అయ్యారు?
ఈ కథ విషయానికి వస్తే ఒక ఫోన్ లో రెండు సిమ్ కార్డులు ఉన్నప్పుడు ఒక మనిషిలో రెండు బ్రైన్స్ ఉంటేఎలా ఉంటది అన్న ఐడియా లోంచి వచ్చింది. అలా డ్యూయల్ సిమ్ కార్డు ఫోన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ కథ రాశాను.


దీనికోసం ఏమైనా రీసెర్చ్ అవసరమైందా?
 అవును. ఆలోచన రాగానే వెంటనే ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను. ఈ ప్రపంచం లో ఇలా ఎవరైనా ఉన్నారా?అని అయితే ఇలా రెండు బ్రైన్స్ తో పుట్టినవారు దాదాపు పదహారు మంది ఉన్నారు. వారు వివిధ వయసులలో వారు మరణించారు. అయితే బ్రతికి ఉంటే ఎలా ఉండేవారు అనేది సినిమా.


ఆ క్యారెక్టర్స్ గురించి చెప్పండి?
ప్రతి ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరు మాస్ మరొకరు క్లాస్ గా ఉంటారు. అలా మా సినిమాలో కూడా అభి రామ్ అనే రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకరు బాగా చదివే వారు, ఒకరు బాగా అల్లరి చేసే క్యారెక్టర్స్.


రాజేంద్ర ప్ర‌సాద్ గురించి?
ఈ సినిమాలో ఆది రాజేంద్ర ప్రసాద్ గారు ఒక తండ్రి కొడుకుల్లా కాకుండా స్నేహితులు లాగ ఉండేలా వారి క్యారెక్టర్స్ డిజైన్ చేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కి మా నాన్న గారి పేరు ఈశ్వర రావు అని పెట్టాను. ఎందుకంటే ప్రతి కథ మన ఇంట్లోచే పుడుతుంది అని నేను నమ్ముతాను.వీళ్లిద్దరి మధ్య కామెడి, ఎమోషన్ చక్కగా కుదిరింది. ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు కంటతడి పెట్టేవిధంగా నటించారు.


ఒక రచయిత దర్శకుడు అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి?
 ఒక రచయిత అయితే పేజీల కొద్దీ డైలాగ్స్ రాసేయొచ్చూ కానీ దర్శకుడు అలా కాదు. ఏ డైలాగ్ పెట్టాలో తెలిసి ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే.. ద్రవపది చీర లాగుతుంటే శ్రీ కృష్ణుడు చీర మాత్రమే అందించాడు. కానీ కురుక్షేత్ర సమయంలో అర్జునుడు యుద్ధం వదిలేస్తే .. పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత చెప్పాడు. అంటే అక్కడ కేవలం చీర అవసరం మాత్రమే ఉంది. ఇక్కడ డైలాగ్ అవసరం ఉంది. అది ప్రతి దర్శకుడు తెలుసుకొని ఏ సీన్ కి ఏం కావాలో అది చెయ్యాలి. అలా ఒక దర్శకుడిగా నేను ఈ కథకు పూర్తి న్యాయం చేసానని అనుకుంటున్నాను. 


దర్శకుడిగా మీ రోల్ మోడల్?
 నాకు దాసరి నారాయణ రావు గారు రోల్ మోడల్. ఆయన డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ షిప్ అన్నారు. నేను ఆయనతో రైటర్ కంపాస్ ఆఫ్ షిప్ అనమని అన్నాను అయితే ఆయన నువ్వు దర్శకుడివి అవ్వు అప్పుడు తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు ఆయన మాట నాకు ఎప్పుడు ప్రతిధ్వనిస్తుంది. 


సినిమా బిజినెస్ ఎలా ఉంది?
ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ తో మంచి బిజినెస్ అయింది. వింటేజ్ శివరాం గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. జీ తెలుగు వారు శాటిలైట్ హక్కులు తీసుకున్నారు. బుర్రకథ డబ్బింగ్ రైట్స్ ఆది కెరీర్ లోనే హైయెస్ట్ రేటుకి అమ్ముడయ్యాయి. ప్రొడ్యూసర్స్ కి టేబుల్ ప్రాఫిట్ ఇచ్చామన్న సంతోషం ఉంది.


పృథ్వితో చాలా కాలం తరువాత స్పూఫ్ చేయించారు కదా?
 పృథ్వి గారితో సాహో సినిమాలోని ఫాన్స్ ,డై హార్డ్ ఫాన్స్ అనే డైలాగ్ చెప్పించాను. అది బాగా వైరల్ అయింది అయితే సినిమాలో వెంటబడ్డావా అనే తారక్ డైలాగ్ ఉంటుంది. దానిని ప్రభాస్ ఫాన్స్ కోసం ట్రైలర్ లో మార్చిచెప్పించడం జరిగింది. సినిమాలో తారక్ డైలాగ్ ఉంటుంది.


నెక్స్ట్ డైరెక్టర్ గానే కొనసాగుతారా?
నేను ఒక ఐదుగురు ప్రొడ్యూసర్స్ కి కథ చేప్పానువారిలో ఒకరికే డైరెక్ట్ చేయగలను. మిగతా వారికి నేను కథ ఇస్తాను.


diamond-ratnababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రెండు రెట్లు ఎక్కువ చూపిస్తానంటున్న మారుతి
కాంబినేషన్ కొత్తగా ఉందంటున్న మ‌హేష్‌
'నేత్ర స‌స్పెన్స్ వీడెదెప్పుడో...?
హాలీవుడ్ స్ధాయికి రౌడీ హీరో క్రేజ్‌.... జోష్‌ మాములుగా లేదుగా...!
క్రేజీ హీరోకి సూప‌ర్‌స్టార్ స‌పోర్ట్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో...?
త‌మ్ముడు స‌క్సెస్ అయితే నేను డ్ర‌స్ మారుస్తా...?
ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న మంజు
వ‌ర్మ `బ్యూటిఫుల్‌` ఘాటు మాములుగాలేదుగా...?
ఉత్తేజ్ స్కూల్‌కి డిమాండ్ బాగానే ఉందే...?
సాయి పల్లవి 'అనుకోని అతిథి'
హీరో వెంక‌టేష్ నాకు ఇన్స్‌పిరేష‌న్‌
డైరెక్ట‌ర్లను అంత మాట అనేశాడేంటి
వి.వి. వినాయ‌క్ కి చోటాకె.నాయుడంటే భ‌య‌మా...?
రాజ‌మౌళి ఈగ తో పోటీ ప‌డుతున్న చీమ
నాసాలో యంగ్ హీరోల హ‌డావిడి...!
మేక‌ప్‌లో న‌న్ను నేనే చూసుకుని భ‌య‌ప‌డ్డాను
శౌర్య‌ని కొత్త‌గా చూపిస్తా
కాశ్మీర్‌లో జ‌రిగే అస‌లు నిజాలు బ‌య‌ట‌పెడ‌తాం
నాకు క‌థ న‌చ్చితే రెమ్యూన‌రేష‌న్ ఇవ్వొద్దు
'హైఫ్లిక్స్స‌లో ఇంత సౌక‌ర్యామా...?
అమెరికాలో ప్రతిరోజూ పండగే న‌ట‌
ఈ సినిమా కుర్రాళ్ళ‌కు మాత్ర‌మే ఫ్మామిలీస్ రావొద్దు
హీరోనే కాదు విల‌న్‌గా కూడా చేస్తా
నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టాప్ ఫైవ్ మూవీ ఇదేన‌ట‌
ఓంకార్‌కి ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది
జ‌న‌నేత జ‌గ‌న‌న్న‌ "ఆటో రజని"కి బ్లెస్సింగ్సా
మా అబ్బాయి క‌ల‌ను నేను నెర‌వేర్చా-చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర‌రావు
రాగల 24 గంటల్లో ఈషా రెబ్బా ఏం చేయ‌బోతుందంటే...!
వనవాసం లో ఏం జ‌ర‌గ‌బోతుంది...?
నవంబర్ 8న మీసం తిప్ప‌నున్న శ్రీ‌విష్ణు
అమెరికాలో బెల్లంకొండ గణేశ్ షూటింగ్
అల‌వైకుంఠ‌పురంలో ఆ సీన్ల‌కి పెద్ద‌పీట‌!
ఘనంగా ద‌ర్శ‌కుడు బాబీ కుమార్తె వైషు పుట్టినరోజు వేడుక
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.