యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై అత్యద్భుతమైన వ్యూస్ సాధించి అదరగొట్టిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తొలిసారి టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. జీబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ని ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక ఈ రోజు ఈ సినిమాలోని మొదటి పాటైన 'సైకో సయ్యా' అనే పల్లవితో సాగె పాట టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సాంగ్ టీజర్ చూస్తుంటే అచ్చం బాలీవుడ్ సాంగ్ లా ఉంది అని అంటున్నారు వీక్షకులు. ఇక ఈ టీజర్ లో వెస్ట్రన్ స్టైల్ అవుట్ ఫిట్స్ తో ప్రభాస్ మరియు శ్రద్ధ ఇద్దరూ సూపర్బ్ గా ఉన్నారు అనే చెప్పాలి. 

ఇక ఈ సాంగ్ లో ప్రభాస్ వేసిన స్టెప్స్ కి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ టీజర్ లోని ఫుల్ సాంగ్ ని ఈనెల 8న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ టీజర్ లతో ఈ రేంజ్ లో హైప్ సంపాదించిన సాహో సినిమా, రేపు విడుదల తరువాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: