యువ హీరో నాగ శౌర్య తన కెరియర్ ను చేజేతులారా చెడగొట్టుకుంటున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తర్వాత మళ్లీ రేసులో వెనుకపడ్డాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ఈమధ్య మల్టీస్టారర్ సినిమాలకు సై అంటున్నాడు. ఇక ఇప్పుడు తన పాత్రకు అంత ప్రాధాన్యత లేకున్నా సరే సినిమాలు చేస్తున్నాడు. 


లేటెస్ట్ గా సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో నాగ శౌర్య విక్రం పాత్రలో కనిపించాడు. అఫ్కోర్స్ స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమె పక్కన పాత్ర కాదని చెప్పకపోవచ్చు. కాని సోలో హీరోగా చేయాల్సిన నాగ శౌర్య ఇలా తనకు ఏమాత్రం ఉపయోగపడని పాత్రలు చేయడం ఎందుకని కొందరు ప్రేక్షకుల మాట.


అయితే నాగ శౌర్య ఓ బేబీ సినిమా చేయడానికి ముఖ్య కారణం సమంత కన్నా ఆ సినిమా దర్శకురాలు నందిని రెడ్డి అని తెలుస్తుంది. నందిని రెడ్డి చేసిన కళ్యాణ వైభోగమే సినిమాలో హీరోగా చేశాడు నాగ శౌర్య ఆ సినిమా హిట్ అందుకుంది. అప్పటి నుండి శౌర్య, నందిని రెడ్డి మంచి స్నేహితులుగా ఉన్నారు.


ఆ కారణం వల్లే ఓ బేబీలో చిన్న పాత్రలో నాగ శౌర్య నటించి ఉండొచ్చని అంటున్నారు. తను చేసిన విక్రం పాత్రకు నాగ శౌర్య పర్ఫెక్ట్ గా అనిపించాడు. కాని హీరోగా సినిమాలు చేయాల్సిన ఈ టైంలో నాగ శౌర్య ఇలాంటీ చిన్న చిన్న పాత్రలు చేయడం వేస్ట్ అని ప్రేక్షకుల టాక్. ప్రస్తుతం నాగ శౌర్య రెండు ప్రాజెక్టులను సెట్స్ మీద ఉంచాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: