కన్నడ భామ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ దేవదాస్ సినిమాలో నటించినా ఆ సినిమా ఫలితం అమ్మడి మీద ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది రష్మిక.


విజయ్ దేవరకొండతో రష్మిక మరోసారి రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 26న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న రష్మిక నితిన్ భీష్మ సినిమాలో కూడా నటిస్తుంది.


ఇక ఇదే కాకుండా తమిళంలో కూడా క్రేజీ ఛాన్స్ పట్టేసిందట రష్మిక. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా అని చెప్పుకొచ్చిన రష్మిక ఫైనల్ గా ఆ ఛాన్స్ అందుకుందట. ప్రస్తుతం విజయ్ 63వ సినిమా అట్లీ డైరక్షన్ లో చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా బిజిల్ టైటిల్ ఫిక్స్ చేశారు.


ఇక ఈ సినిమా తర్వాత విజయ్ 64వ సినిమా లోకేష్ కనకరాజు డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక జోడీ కడుతుందట. ఈ సినిమాలో విజయ్ తో ఇద్దరు హీరోయిన్స్ జతకడతారని తెలుస్తుంది. రష్మికతో పాటుగా రాశి ఖన్నా కూడా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: