ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు.  ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్-సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్ ను ప్రకటించారు.  'ఎంత మంచివాడవురా' అనేది టైటిల్.  అయితే జస్ట్ టైటిల్ లోగో పోస్టర్ మాత్రమే విడుదల చేసి ఊరుకోకుండా టైటిల్ లోగోతో పాటు  టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టు కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మంచి మనసున్న మనిషి పాత్రలో నటిస్తున్నాడని అర్థం అవుతుంది.  ఈ సినిమా ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.  గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతమందిస్తుండగా దాదాపు ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ రాజమండ్రిలోనూ.. హైదరాబాద్ లోనూ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. ఇక రెగ్యులర్ షూటింగ్ జులై 24 నుండి ప్రారంభిస్తారని లేటెస్ట్ అప్‌డేట్. 

సతీష్ వేగేశ్న నితిన్ తో శ్రీనివాస కళ్యాణం సినిమాను తెరకెక్కించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్ 118 తో డీసెంట్ హిట్ ని సొంతం  చేసుకున్నాడు. ఈ సినిమాలో నివేదా థామస్, శాలినీ పాండే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం.  


మరింత సమాచారం తెలుసుకోండి: