ఈ రోజుల్లో ఇవన్నీ సహజం. కానీ ఎందుకో ఇలాంటి స్టేట్మెంట్స్ వింటే మాత్రం ఒక్కసారి షాక్ తిన్నట్లుగా ఉంటుంది. అంటే ఎక్కడో కల్చర్ మన బ్లడ్ లో ఉండడం వల్ల ఆలా అనిపిస్తుందేమో. విషయానికి వస్తే బాలీవుడ్లో ఓ సీనియర్ హీరోయిన్ కి పెళ్ళి కాలేదు. ఆమె మీడియాతో లేటేస్ట్ గా మాట్లాడుతూ తనకు మూడేళ్ళ కూతురు ఉందని తొలిసారిగా రివీల్ చేసింది. దాంతో ఇది సెన్షేషనల్ న్యూస్ అయి కూర్చుంది.
నలభై అయిదేళ్ళ మహీ గిల్ . బాలీవుడ్ నటి చేసిన ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్‌తో ట్రెండింగ్ అవుతోంది. పంజాబ్‌కు చెందిన మహీ గిల్ 2003లో బాలీవుడ్లో తన కెరీర్ ప్రారంభించింది. హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించింది. ‘దబాంగ్’, దబాంగ్ 2, 3తో పాటుగా ‘మిర్చ్’, ‘జంజీర్’, ‘దేవ్ డీ’, ‘షాహిబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ తదితర చిత్రాల్లో నటించింది.
ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకు ఇప్పటికే మూడేళ్ల కూతురుందని తెలిపింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆ అవసరం కూడా ఉందని భావించడం లేదని స్పష్టం చేసింది. తనకు కూతురు ఉందనే విషయాన్ని ఇప్పటి వరకు వెళ్లడించకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ లేదని, ఎవరూ అడగకపోవడం వల్లే చెప్పలేదని మహీ తెలిపింది.
ఒక బిడ్డకు తల్లిగా ఉండడం గర్వంగాఉంది. ఇక పెళ్లి చేసుకోవడం అనేది నా పర్సనల్ ఛాయిస్. చేసుకోవాలని అనిపిస్తే చేసుకుంటాను. పెళ్లి అనేది మన ఆలోచనా ధోరణిపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడంలో ఇబ్బంది లేదని చెబుతూ పెళ్లి లేకపోయినా పిల్లల్ని కుటుంబాన్ని కలిగి ఉండవచ్చని అభిప్రాయపడింది. మరి మహి గిల్ కామెంట్స్ తో ఏకీభవించే వారూ ఉంటారు. కాదనే వారూ ఉంటారు. ఎవరి ఇష్టం వారిది. అంతే.