వయసు పద్దెనిమిది, అందం ఉంది. అభినయం ఇంకా తేలాలి. కానీ టీజర్ చూస్తే చాలు హీరోయిన్ మెటీరియల్ బాగానే ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఫస్ట్ మూవీయే బరువైన పాత్ర రావడం అంటే అద్రుష్టమే.  ఎటూ ప్రేమ కధ కాబట్టి స్ట్రాంగ్ కంటెంట్  ఉంటుంది. యూత్ కి కనెక్ట్ అయితే చాలు కమర్షియల్ హిట్టే.


ఇదంతా ఎందుకంటే శివాత్మిక మొట్ట‌ మొదటి సినిమా దొరసాని గురించి. యాంగ్రీ  స్టార్ డాక్టర్ రాజశేఖర్ జీవితల రెండవ కూతురు శివాత్మిక హీరోయిన్ గా వస్తున్నడెబ్యూ మూవీ. అంచనాలు అలా ఉండగానే ట్రెడిషనల్ లుక్ తో టీజర్ రావడంతో పాజిటివ్ బజ్ వచ్చేసింది. జీవిత లుక్స్ తో పాటు, కొత్తందంతో శివాత్మిక బాగానే మెరిసింది ఈ మూవీలో


పద్దెనిమిదేళ్ల ప్రాయంలో వయసుకు తగిన పాత్ర. ఈ మొత్తం సినిమాలో శివాత్మిక పాత్రకు పది నుంచి పదిహేను డైలాగులు మాత్రమే ఉంటాయట. మొత్తం అభినయం కళ్ళతోనే చేయాలి. అంటే   అలనాటి హీరోయిన్లకు వచ్చిన అవకాశం ఇపుడు శివాత్మికకు దక్కుతోందన్నమాట. ఇక అక్క శివాని మూవీ అడవి శేషుతో స్టార్ట్ అయి మధ్యలో ఆగిపోయింది. 


ఆ తరువాత శివాత్మిక ఎంట్రీ ఇస్తూ చేసిన డెబ్యూ మూవీ  దొరసాన్ ఇపుడు  రిలీజ్ కాబోతోంది. అంటే అక్క కంటే చెల్లెలు లక్ అన్న మాట. ఈ మూవీ టీజర్ టాక్ చూస్తూంటే హిట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి శివాత్మిక వాళ్ళ అమ్మా నాన్నల మాదిరిగా టాలీవుడ్ ని చాలా కాలం ఏలుతుందేమో. చూదాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: