Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 10:02 pm IST

Menu &Sections

Search

పెద్ద‌వాళ్ళంద‌రికీ న‌చ్చే ఎమోష‌న‌ల్ చిత్ర‌మిది- శౌర్య‌

పెద్ద‌వాళ్ళంద‌రికీ న‌చ్చే ఎమోష‌న‌ల్ చిత్ర‌మిది- శౌర్య‌
పెద్ద‌వాళ్ళంద‌రికీ న‌చ్చే ఎమోష‌న‌ల్ చిత్ర‌మిది- శౌర్య‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స‌మంత, ల‌క్ష్మి, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, నాగ‌శౌర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `ఓ బేబీ`. ఇటీవ‌ల విడుద‌లై మంచి అప్రిషియేష‌న్ తెచ్చుకుంది. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ పాత్ర చేసిన నాగ‌శౌర్య మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..
 
సినిమా ఎలా మొద‌లైంది...
నందినిరెడ్డిగారు ఇంటికొచ్చి నెరేట్ చేశారు. అప్పుడు నా కేర‌క్ట‌ర్ చాలా త‌క్కువ‌గా అనిపించింది. గెస్ట్ అప్పియ‌రెన్సే అనుకున్నా. అయినా నందినిరెడ్డిగారికి ఓకే చెప్పేశా. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్ట‌మైన ల‌క్ష్మిగారు ఉన్నారు. మురారి చూసిన‌ప్ప‌టి నుంచి నాకు ల‌క్ష్మిగారితో ప‌నిచేయాల‌ని కోరిక‌. ఇంత‌కు ముందు ఒక‌సారి అనుకున్నాం కానీ, కుద‌ర‌లేదు.

ల‌క్ష్మిగారిని క‌లిశారా...
ల‌క్ష్మిగారికి డేట్లు కుద‌ర‌లేదు. ఆమె పాత్ర కాస్త చేస్తే గానీ, దాన్ని బేస్ చేసుకుని స‌మంత‌గారు చేయ‌లేను అని అన్నారు. సో సినిమా నాతోనే మొద‌లైంది. ఆ త‌ర్వాత ల‌క్ష్మిగారు జాయిన్ అయ్యారు. ఆవిడ సెట్లో ఉన్న‌ప్పుడు ఒక రోజు మొత్తం నేను, స‌మంత‌గారు అక్క‌డే ఉన్నాం. నేను ఒక్క‌సారి ప‌ల‌క‌రించాను. దూరం నుంచి చూస్తూ నిలుచున్నాను. నాకేమో సిగ్గెక్కువ‌. అందరూ దాన్ని పొగ‌రు అని అనుకుంటారు.
 రొమాంటిక్ సీన్స్ లో దూర‌దూరంగా ఉన్నార‌ట‌...
 చెప్పాను క‌దా.. కాస్త నాకు సిగ్గెక్కువ‌. నేను రొమాంటిక్ సీన్స్ షూటింగ్ అవాయిడ్ చేయ‌డానికి ట్రై చేస్తుంటా. కానీ త‌ప్ప‌దంటే మాత్రం చేస్తా.

 క‌థ విన‌గానే మీకేం అనిపించింది...
యూత్‌కి క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. మా మ‌ద‌ర్‌కి, ఫాద‌ర్‌కి, గ్రాండ్ మ‌ద‌ర్‌కీ క‌నెక్ట్ అయ్యే సినిమా. పెద్ద‌వాళ్ళ‌కు క‌నెక్ట్ అయ్యే సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నిపించింది.

 హీరోగా సినిమాలు చేస్తూ కేమియో చేయ‌డం వ‌ల్ల ఇబ్బంది అవుతుంద‌ని అనుకోలేదా...
లేదు. ఎందుకంటే హిట్ సినిమాలో భాగం కావాల‌ని అనుకున్నా. నాకు న‌చ్చిన వారితో సినిమా చేయ‌డం నాకు చాలా ఇష్టం. నాకు నందినిరెడ్డిగారు అక్క‌లాంటిది. అవ‌స‌రాల శ్రీనివాస్‌గారు కూడా మా ఫ్యామిలీలో వ్య‌క్తిలాంటి వారే. అస‌లు ఈ సినిమా గురించి నందినిరెడ్డిగారు నాకు చెప్ప‌డానికి హెసిటేట్ చేస్తుంటే... మా అమ్మ ఫోర్స్ చేసి నాకు చెప్పించింది. నా చేత వినిపించింది. విన‌గానే త‌ప్ప‌కుండా హిట్ అయ్యే సినిమా అనిపించింది.

లుక్ బావుంద‌ని కాంప్లిమెంట్స్ వ‌స్తున్నాయా...
అంద‌రూ అదే అంటున్నారు. అంటే ఇన్నాళ్లు నేను బాగా లేనా అని కూడా అనిపించింది. అయితే ఈ సినిమాలో హెయిర్ క‌ట్ డిఫ‌రెంట్‌గా ఉంది. కాస్త లావ‌య్యాను. గ‌డ్డం బావుంద‌ని చాలా మంది అంటున్నారు.
 
స‌మంత‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది...
 స‌మంత గారితో ప‌నిచేస్తున్న‌ప్పుడు నేను పెద్ద హీరోయిన్‌తో ప‌నిచేస్తున్నాన‌ని ఏ రోజూ అనిపించ‌లేదు. స‌మంత మీద విస్కీ ఉమ్మేసే సీన్ ఒక‌టి ఉంటుంది. దాన్ని నేను చేయాలి. స‌మంత హెసిటేట్ చేయ‌కుండా ఉమ్మేయ‌మంటుంది. స‌మంత మీద ఉయ్య‌డం ఏంటి?... న‌న్ను బ‌య‌ట ఊస్తార‌ని అనుకున్నా. కానీ స‌మంత‌గారు డెడికేటెడ్ వ్య‌క్తి. ఆమె కోఆప‌రేట్ చేయ‌డం వ‌ల్లే ఆ సీన్ చేయ‌గ‌లిగా.

 సినిమా చూసి మీ మ‌ద‌ర్ ఏమ‌న్నారు...
సినిమా చూసిన త‌ర్వాత మా అమ్మ ఏమీ అన‌లేదు. కానీ ఆ త‌ర్వాత ఇంట్లో ఏ స‌న్నివేశ‌మైనా `ఓబేబీ`ని ప్ర‌స్తావిస్తోంది. లైక్ తిండి ద‌గ్గ‌ర ఇంకా మిగ‌తా చిన్న చిన్న విష‌యాల్లో అలా ఆ మూవీ నుండి బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

త‌రువాత‌ సినిమాలేంటి...
మా ఓన్ ప్రొడ‌క్ష‌న్‌లో అశ్వ‌త్థామ చేస్తున్నాం. ఫ‌లానా అబ్బాయి, ఫ‌లానా అమ్మాయి అని అవ‌స‌రాల శ్రీనివాస్‌తో చేస్తున్నా. పార్థు అని మ‌రో సినిమా జ‌రుగుతోంది.

ఈ మ‌ధ్య రిస్క్ చేయ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిందా...
రిస్కు చేయ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగింది. అంత రిస్కు అవ‌స‌ర‌మా అని అంటే అవ‌స‌ర‌మే. ఆడియ‌న్స్ చాలా క్లీన్‌గా అబ్జ‌ర్వ్ చేస్తున్నారు. అందులోనూ అది 14 నిమిషాల సీను. డూప్ పెడితే ఆడియన్స్ కి అర్థ‌మైపోతుంది. హీరో ప‌డే టెన్ష‌న్ ఆడియ‌న్ ప‌డాలంటే త‌ప్ప‌కుండా నేనే క‌ష్ట‌ప‌డాల‌ని అర్థ‌మైంది. అందుకే నేనే చేస్తున్నా. 


కాస్త ఆర్నెళ్లు లేట్ అయినా ఫ‌ర్వాలేదు.. కానీ ప‌ర్ఫెక్ట్ గా చేయాల‌నుకున్నా...
అశ్వ‌త్థామ క‌థా ర‌చ‌యిత‌ను నేనే. చ‌లోకి కూడా నేనే క‌థ ఇచ్చాను. కానీ ఆ సినిమాకు పేరు వేసుకోలేదు. ఈ సినిమాకు వేసుకుంటున్నా. అశ్వ‌త్థామ రెండు షెడ్యూళ్ల‌య్యాయి. ఫ‌లానా అబ్బాయి.. ఫ‌లానా అమ్మాయి కూడా రెండు షెడ్యూళ్ల‌య్యాయి. ఈ సినిమాలో నేను ఏడు డిఫ‌రెంట్ పాత్ర‌లు చేస్తున్నా. వీటి త‌ర్వాత పార్థు చేస్తాను.


nagashaurya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైదరాబాద్ నవాబ్ 2 మిమ్మల్ని నవ్విస్తుంది
మిస్ట‌ర్ కె.కె. ప్రీ రిలీజ్‌
బిగ్ బాస్ కు సెన్సారు అవ‌స‌రం....
ఆగస్టు 15 న  'శర్వానంద్,  'రణరంగం'
ఎట్ట‌కేల‌కు భార‌తీయుడు 2 ..సినిమా రెండ‌వ షెడ్యూలు...
నాకు ఇదొక డ‌బుల్ ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌- అక్ష‌ర‌హాస‌న్‌
గ్రేషేడ్స్ తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టైల్లో ఉండే పాత్ర‌- విక్ర‌మ్‌
బుజ్జి బంగారం అంటున్న కార్తికేయ‌!
ఐసిసీకి అదిరిపోయే పంచ్‌
ఒక్క పోస్ట్  లో టాప్ లిస్ట్‌లోకి ప్రియాంక
‘ఓ బేబీ’ విజ‌యం అమ్మ, అమ్మమ్మకు అంకితం – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌
యూత్ ను ఆకట్టుకుంటొన్న  "కెఎస్100"
ఆఖ‌రి షెడ్యూల్ లో  `సుంద‌రాంగుడు` 
కులానికి అతీతంగా పెళ్లాడిన వంగ‌వీటి రంగా!
నిర్మాత‌ల‌ను త‌న చుట్టూ తిప్పుకున్న రాజ‌నాల‌...
వీరి మ‌ర‌ణాలు ఎప్ప‌టికీ మిస్ట‌రీలేనా...!
బికినీతో ఈషా రెబ్బా
నానా లాస్ రానా గెయిన్‌
వనవాసం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను - అల్లరి నరేష్.
ఎమోష‌న‌ల్ సీన్స్ అంద‌రి మ‌న‌సును క‌దిలించాయి - హీరోయిన్ అన్యా సింగ్
గడీల నేపథ్యంలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది....  నిర్మాతలు
బైలంపుడి ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్
 `శివ‌శంక‌రీ` ఫ్యూజ‌న్ కవ‌ర్  సాంగ్ లాంచ్‌!!
పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `ఎర్ర‌చీర‌`
నాచురల్ స్టార్ నాని 'గ్యాంగ్ లీడర్'  ఫస్ట్ లుక్
ఓ బేబిది ఊహించ‌ని విజ‌యం
పూరీతో చెయ్య‌డం ప‌రిణితి చెందిన భావ‌న క‌లిగింది- న‌భాన‌టేష్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.