ఇప్పటికే తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారమైన బిగ్ బాస్ రెండు సీజన్లు, మంచి రేటింగ్స్ అలానే ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మొదట్లో ఇటువంటి షోలు మన తెలుగులో చూడరని, ఈ షో మరికొద్ది రోజుల తరువాత ఆగిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే మెల్లగా మనవాళ్ళు బిగ్ బాస్ షో కి కనెక్ట్ అవడం మొదలెట్టారు. అలా మెల్ల మెల్లగా ఈ షో విపరీతమైన ప్రేక్షక అభిమానంతో అద్భుతంగా ముందుకు సాగింది. మొదటి సీజన్ కు హోస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్, షో ను ఎంతో సక్సెస్ చేస్తే, రెండవ సీజన్ కు హోస్ట్ గా వచ్చిన నాని, 

దానిని మరింత పైకి తీసుకెళ్లారు అనే చెప్పాలి. ఇక అతి త్వరలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సారథ్యంలో ప్రసారం కాబోతున్న మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ షోకు నాగార్జున హోస్ట్ గా వస్తున్నట్లు బయటి వచ్చిన ఈ ఒక్క వార్త మినహా, పార్టిసిపెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, అసలు పార్టిసిపెంట్స్ ఎంతమంది, అలానే షో ప్రారంభ తేదీ, వంటి ఈ విషయాలపై ఇప్పటివరకు బిగ్ బాస్ టీమ్ నుండి ఏ మాత్రం సమాచారం లేదు. ఇక ఈ మూడవ సీజన్ ఈనెల 21న ప్రారంభం కాబోతోందని కొందరు వార్తలు ప్రచారం చేస్తుంటే, మరికొందరేమో కొన్ని కారణాల వలన షో టెలికాస్ట్ చేయడం మరికొంత ఆలస్యం అవుతుందని, కాబట్టి ఆగష్టు మొదటి వారంలో ఈ షో ప్రారంభం అవుతుందని అంటున్నారు. 

ఇక ఇటువంటి పలు వార్తలు విపరీతంగా పుకారవుతున్నప్పటికీ, వీటిలో ఏ ఒక్క వార్తపై కూడా బిగ్ బాస్ టీమ్ నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన మాత్రం రాలేదు. ఈ విషయమై పలువురు నెటిజన్లు బిగ్ బాస్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా షో ను మరింత ఆలస్యం చేస్తే ప్రేక్షకుల్లో దానిపై ఇంటరెస్ట్ కూడా తగ్గే అవకాశం ఉందని, కాబట్టి వీలైనంత త్వరగా సీజన్ 3ని ప్రసారం చేస్తే మంచిదని పలువురు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ టీమ్ దీనిపై స్పందించి, తమ షోను ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: