గత కొంత కాలంగా హిట్లు లేక డీలా పడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భవితవ్వాన్ని తమిళ తంబి చేతిలో పెట్టేసాడట. తెలుగువాళ్లంతా ఎన్టీఆర్ ను నిలువునా ముంచుతుండడంతో ఇక కెరియర్ లో నిలదొక్కుకోవాలంటే వాస్తుదోషం తొలగింపు తప్పని సరి అని భావించి తమిళ డైరెక్టర్ చేతుల్లో తన భవిష్యత్తు పరీక్షించుకునేందుకు రెడి అయ్యాడు ఎన్టీఆర్ అంటున్నారు.

దమ్ము, బాద్ షా, ఇప్పుడు రామయ్యా వస్తావయ్యా... ఇలా సినిమాలన్నీ సరైక కథ, డైరెక్షన్ వంటి లోపాలతోనే బోల్తాపడ్డాయని, ఎన్టీఆర్ పర్ ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందనే టాక్ వచ్చాయి. అందుకే తనకు తగ్గట్టుగా న్యాయం చేసి బిగ్ హిట్ ఇచ్చే భాద్యతను తమిళ డైరెక్టర్ లింగుస్వామికి ఇచ్చాడట ఎన్టీఆర్.

లింగుస్వామి తమిళంలో హిట్లు అందిస్తున్న డైరెక్టర్. ఇప్పటి వరకు విశాల్ కు ‘సంధ ఖోజ’(పందెం కోడి), విక్రమ్ కు ‘భీమా’ వంటి హిట్టు సినిమాలు అందించాడు. ఇప్పుడు కమల్ హాసన్ తో ‘ఉత్తమ విల్లేన్’ సినిమా తీస్తున్నాడు. నిజానికి లింగుస్వామి తెలుగులో మహేష్ బాబు తో హిట్టు సినిమా తీయాలనుకున్నప్పటికి అది కుదరలేదని, దీంతో ఎన్టీఆర్ తో జత కట్టాడు అంటున్నారు. తమిళ తంబితో నైనా ఎన్టీఆర్ ఫేట్ మారుతుందేమో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: