‘షాపింగ్ మాల్’తో తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌య‌మై.. ‘జ‌ర్నీ’తో జ‌ల‌క్ ఇచ్చి.. ‘సీత‌మ్మ వాకిట్లో’ త‌ళుక్కున మెరిసి.. ‘గీతాంజ‌లి’తో జనాన్ని భ‌య‌పెట్టిన అంజ‌లి తెలుసు క‌దా? త‌మిళం నుంచి ఆద‌రాబాద‌ర‌గా తెలుగులోకి వ‌చ్చేసి.. ఇక్కడ ఒక‌టీ అరా వండ‌ర్స్ క్రియేట్ చేసి.. ఆ త‌ర్వాత క‌నుమ‌రుగైన అమ్మడు. త‌ర్వాత త‌న త‌ప్పు తెలుసుకుందేమో తెలీదు కానీ తిరిగి చెన్నప‌ట్నం చేరి వ‌రుస సినిమాలు చేస్తోంది. అంజ‌లి తెలుగు అమ్మాయే అయినా త‌మిళ ప్రేక్షకుల‌కు ఎక్కువ‌గా ప‌రిచ‌యం. 


ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లతో అటు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు ఇటు హార‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని త‌న న‌ట‌న‌తో ఎంట‌ర్‌టైన్ చేసిన అందాల తార అంజ‌లి. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, గీతాంజ‌లి, బ‌లుపు ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మదిలో నిలిచిపోయింది.


ఇప్పుడు మ‌న అంజ‌లి స‌రికొత్త సినిమాతో పూర్తి కామెడీ చిత్రంతో మ‌న ముందుకు వ‌స్తుంది. కృష్ణ‌న్ జ‌య్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లూన్ సినిమా ద‌ర్శ‌కుడు కె ఎన్ సినీష్ నిర్మాత‌గా ది సోల్జ‌ర్స్  ఫ్యాక్ట‌రీ ప‌తాకం పై నిర్మించ‌బ‌డుతుంది.ప్రస్తుతం మాధవన్‌, అనుష్కలతో కలిసి ‘సైలెన్స్‌’ అనే ఓ సినిమాలో అంజలి నటిస్తోంది. ఈ సినిమా అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తమిళంలో మరో హర్రర్‌ చిత్రానికి అంజలి కమిట్ అయ్యింది,


మరింత సమాచారం తెలుసుకోండి: