టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ బోయపాటి తో సినిమా అంటే చాలామంది నిర్మాతలు ఎగబడుతుంటారు. అయితే దిల్ రాజు మాత్రం తనకి స్క్రిప్ట్ చెబుదామని వచ్చిన బోయపాటికి షాక్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే గతంలో నిర్మాత దిల్ రాజు. కేవలం కుటుంబ కథా చిత్రాలను మాత్రమే నిర్మించేవారు.


అయితే రాను రాను తెలుగు ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారటంతో కొత్త కొత్త సబ్జెక్టులకు జై కొట్టడంతో..దిల్ రాజు కూడా తన పంతాన్ని మార్చుకున్నారు. అన్ని సినిమాలు చేస్తాను అని అన్ని జోనర్ల డైరెక్టర్లకు డోర్స్ ఓపెన్ చేసాడు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే..డైరెక్టర్ సబ్జెక్ట్ చెప్పినా ...బడ్జెట్ మాత్రం తానే డిసైడ్ చేస్తాం అని దిల్ రాజు తన దగ్గరికి వచ్చిన సబ్జెక్ట్ నచ్చిన డైరెక్టర్ తో చెప్పడంతో దిల్ రాజు వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


ఇందుమూలంగా నే గతంలో భారతీయుడు సీక్వెల్‌ తీయడానికి దిల్‌ రాజు ఉత్సాహపడ్డాడు కానీ శంకర్‌ బడ్జెట్‌ గురించి మాత్రమే మాట్లాడుతుంటే దిల్‌ రాజు గౌరవంగా తప్పుకున్నాడు. ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దిల్ రాజు కి స్క్రిప్ట్ చెబుదామని వచ్చిన సమయంలో...తన షరతుల మొత్తం ముందే బోయపాటికి చెప్పటంతో తృప్తి చెప్పకుండానే బోయపాటి వెనక్కి వెళ్లిపోయినట్లు..దీంతో దిల్ రాజు బోయపాటికి షాక్ ఇచ్చినట్లు అయిందని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.



మరింత సమాచారం తెలుసుకోండి: