అన్న హీరో అయ్యాడంటే ఆ రూట్ లోనే తమ్ముడు కూడా హీరోకి రెడీ అవుతాడు. తెలుగు పరిశ్రమలో దానికి ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవే.. అన్న మెగాస్టార్ అవగా తను ఏర్పరచిన రెడ్ కార్పెట్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ తో పవర్ స్టార్ గా మారాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇదే క్రమంలో మరో అన్నదమ్ములు ఇండస్ట్రీని ఏలేయడానికి వచ్చారు.


ఇంతకీ వాళ్లెవరనేగా మీ డౌట్ ఇంకెవరు ది దేవరకొండ బ్రదర్స్. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ హీరో పేరు చెబితే చాలు యూత్ అంతా ఊగిపోతున్నారు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఈ నాలుగు సినిమాల హిట్లు అతన్ని స్టార్ హీరోని చేశాయి. ఇక ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు అన్నట్టుగా ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.


అతని మొదటి సినిమా దొరసాని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కె.వి.ఆర్ మహేంద్ర డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక హీరోయిన్ గా నటించింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు హీరోగా ఆనంద్, హీరోయిన్ గా శివాత్మిక పాస్ అయినట్టే అంటున్నారు.


తొలి సినిమా పర్వాలేదు అనిపించిన ఆనంద్ అన్న లానే కొత్త కథలతో కుమ్మేయడం గ్యారెంటీ అనిపిస్తుంది. చూస్తుంటే దేవరకొండ బ్రదర్స్ నిజంగానే ఇండస్ట్రీని ఏలేసేలా ఉన్నారని చెప్పొచ్చు. అయితే విజయ్ ప్రతి సినిమా కసితో చేస్తాడు మరి ఆ పట్టుదల తమ్ముడిలో ఉంటుందో లేదో తర్వాత తెలుస్తుంది. మొత్తానికి దేవరకొండ బ్రదర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారారు.



మరింత సమాచారం తెలుసుకోండి: