ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా , అన‌ఘ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సినిమా గుణ 369.  అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీత అందించిన ఈ సినిమాలో తొలి ప‌రిచ‌య‌మా ఇది... తొలి ప‌ర‌వ‌శ‌మా ఇది అనే  తొలి పాట‌ను  నిర్మాత దిల్ రాజు విడుద‌ల చేశారు. విశ్వ‌నాథ్ రాసిన ఈ పాట‌ను హ‌రిచ‌ర‌ణ్ పాడారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ -  మంచి మెలోడీ సాంగ్‌. ఫీల్ గుడ్ సాంగ్‌, అంద‌రికీ న‌చ్చుతుంది. క‌మ‌ల్‌హాస‌న్‌గారి గుణ‌.. బాల‌కృష్ణ‌గారి ఆదిత్య 369 సినిమాల‌ రెండు టైటిల్స్ స‌గం స‌గం క‌లిసి చ‌క్క‌గా క‌థ‌కు త‌గ్గ‌ట్టు గుణ 369 అనే టైటిల్  కుదిరింది. 

టైటిల్‌లోని 369 ఏంటో ట్రైల‌ర్‌ను చూడ‌గానే అర్థ‌మైంది. ట్రైల‌ర్ బావుంది. కార్తికేయ‌కు, టీమ్‌కు ఆర్‌.ఎక్స్ 100లా సినిమా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటు శుభాకాంక్షలు తెలిపారు. ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ ఇదేదో వండి వార్చిన క‌థ కాదు. జ‌రిగిన క‌థ‌. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించాం. రియ‌లిస్టిక్‌గా ఉంటుంది. త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్కరికీ క‌నెక్ట్ అవుతుంది. ఇదివ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్ మీద‌ ఇలాంటి క‌థ రాలేదు.అలాంటి ఒరిజినాలిటీ ఉన్న క‌థ ఇది..అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ టాలీవుడ్ లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ (ఏస్) ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజు చేతుల మీదుగా మా గుణ 369 సినిమాలోని ఫస్ట్ సాంగ్ విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా ఉంది . సినిమాలోనూ యువ‌త‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను న‌చ్చే స‌న్నివేశాలు పుష్క‌లంగా ఉంటాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఆగ‌స్టు 2న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం  అన్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: