నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. జెర్సీ తర్వాత నాని చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నాని గ్యాంగ్ లీడర్ అని ఎనౌన్స్ చేయగానే టైటిల్ సమస్య ఏర్పడింది. మెగా ఫ్యాన్స్ కొందరు ఈ టైటిల్ నాని సినిమాకు పెట్టడం వల్ల అసంతృప్తి వెళ్లడించారు.


మరో పక్క మెగా అభిమాని ఒకరు ఇదే టైటిల్ తో సినిమా చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇవన్ని రూమర్స్ అని తేలింది. నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ ను కన్ఫాం చేస్తూ ప్రీ లుక్ రివీల్ చేశారు. నాని గ్యాంగ్ లీడర్ ప్రీ లుక్ లో ఐదుగురు ఆడవాళ్లకు నాని అభయం ఇవ్వడం కేవలం చేతులు మాత్రమే చూపించారు.  


ఈ సినిమా ప్రీ లుక్ లో జూలై 15న ఫస్ట్ లుక్, 18న ఫస్ట్ సాంగ్, 24 న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా మోహన్ నటిస్తుంది. ఆగష్టు 30న రిలీజ్ ప్లాన్ చేసిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ తో మరోసారి తన సత్తా చూపాలని ఫిక్స్ అయ్యాడు.  


ఇక ఈ సినిమాతో పాటుగా నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అదితి రావు హైదరి, నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: