టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ చైతూ-సమంత వివాహానంతరం జంటగా నటించిన ‘మజిలీ’మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఏం మాయచేసావే సినిమాతో ఏర్పడ్డ వీరి ప్రేమ తర్వాత వివాహబంధంగా మారింది.  అయితే పెళ్లైన మూడు నెలల తర్వాత ఇద్దరు సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. కాకపోతే చైతూ నటించిన సినిమాలన్నీ బాక్సీఫీస్ వద్ద డిజాస్టర్లు కాగా..సమంత నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ షేక్ చేశాయి.  శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తీసిన మూవీ ‘మజిలీ’. 

ఈ మూవీ క్రికెట్ క్రీడా నేపథ్యంలో కొనసాగినా మంచి లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఆకట్టుకుంటుంది.  ఈ మూవీలో చైతూ-సమంత ఇద్దరూ భార్యభర్తలుగా నటించారు.  షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది  ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 5న విడుద‌ల అయిన ఈ చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. మండ‌పేట రాజార‌త్న కాంప్లెక్స్ థియేట‌ర్ లో ఈ మూవీ స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది.  కథ విషయానికి వస్తే..తాను ప్రేమించిన అమ్మాయి తనకు దూరం కావడంతో మనసు వికలమైన హీరోకి మరో పెళ్లవుతుంది.

అప్పటికీ ఆ యువతి ఆ హీరోని ఎంతగానో ఇష్టపడటం వల్ల తాను ఓ యువతిని ప్రేమించాడని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటుంది. అయితే హీరో మాత్రం మొదట ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక..పెళ్లి చేసుకున్న తన భార్యను సరిగా చూసుకోలేక సతమతమవుతుంటారు.  కానీ భర్తే దైవంగా భావించే ఆమె మాత్రం ఎప్పుడూ తనకు అండగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ సందర్భంగా తాను ప్రేమించిన యువతి కూతురు హీరోకి తారసపడటం..ఆ పాపను దత్తత తీసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. 

ప్రేమికురాలిగా దివ్యాంక కౌశిక్ అద్భుత నటన కనబరిస్తే..పెళ్లి చేసుకున్న భార్యగా సమంత తన పాత్రకు ప్రాణం పోసింది. వీరిద్దరి మద్య నలిగిపోయే పాత్రలో నాగ చైతన్య నటనకు విమర్శకుల నుంచిప్రశంసలు అందాయి.  గోపి సుంద‌ర్ సంగీతం కూడా సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించింది. పెళ్ళి త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: