బిగ్ బాస్ పాత కంటస్టెంట్, టాలీవుడ్ టాప్ సింగర్ గీత మాధురి బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కి హాజరైన గీత మధురిని మీడియా ప్రశ్నలపై ప్రశ్నలు వేసింది. ఈ నేపథ్యంలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె అవుననే సమాధానం చెప్పింది. అది బిగ్ బాస్ కి సంబంధించిన ప్రశ్నే.


ఆ ప్రశ్న ఏంటంటే 'గతంలో మీరు బిగ్ బాస్ 2 లో కంటస్టెంట్ గా పాల్గొన్నారు కదా, అందులో పాల్గొన్న తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ 3 వ సీజన్ రాబోతుంది కదా.. మీరు బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్స్ అన్ని చూస్తారనుకుంటా ? అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అవును నేను బిగ్ బాస్ 3 సీజన్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. అందులో కంటస్టెంట్లు ఎలా చేస్తారు అనేది చూడాలి అంటూ సమాధానం ఇచ్చారు.      


కాగా గీతామాధురి ఇటీవలే శ్రీమంతం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో ప్రతి ఒక్కరికి తెలుసు. త్వరలోనే ఇప్ పండంటి బిడ్డకు జన్మ నివ్వబోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన సింగర్ కెరియర్ అలాగే కొనసాగిస్తానని ఆమె చెప్పారు.కాగా బిగ్ బాస్ 2 లో గీత మాధురి టైటిల్ గెలుచుకునే వరుకు వెళ్లినప్పటికీ గెలవలేకపోయారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ 3 సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: