బాలీవుడ్‌లో యంగ్ హీరో రానా స్ట్ర‌గుల్ గురించి తెలిసిందే. ఆరంభం వ‌రుస‌గా ప‌రాజ‌యాలే ఎదుర‌య్యాయి. ఆర్జీవీ అంతటివాడే ఫ్లాపుల‌తోముంచాడు. అయితే బాహుబ‌లి సిరీస్ ఘ‌న విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో అత‌డికి ఊహించ‌ని క్రేజు వ‌చ్చింది. బాహుబ‌లిలో ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న భ‌ళ్లాలదేవ పాత్ర‌లో అత‌డి న‌ట‌న‌కు హిందీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మర‌థం ప‌ట్టారు. కాళ‌కేయుడితో భీక‌రంగా పోరాడే వీరుడిగా అత‌డిని వోన్ చేసుకున్నారు ఉత్త‌రాది జ‌నం. అటువైనా అక్ష‌య్‌తో క‌లిసి న‌టించిన బేబీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది.

ప్ర‌స్తుతం రానా తెలుగు-త‌మిళంలో వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. హాథీ మేరా సాథీ లాంటి త్రిభాషా చిత్రంలోనూ  న‌టిస్తున్నాడు. ఇక్క‌డ న‌టిస్తుండ‌గానే ఊహించని విధంగా బాలీవుడ్ నుంచి పిలుపు అందింది. హౌస్‌ఫుల్‌4 నుంచి నానా ప‌టేక‌ర్ లాంటి సీనియ‌ర్ హీరో త‌ప్పుకోవ‌డంతో ఆ అవ‌కాశం కాస్తా రానాను వ‌రించింది. నానా ప‌టేక‌ర్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌తో బాలీవుడ్ అట్టుడికిన సంగ‌తి తెలిసిందే. అటుపై  నానా లాస్‌.. రానా గెయిన్‌! అంటూ అప్ప‌ట్లో ముచ్చ‌టించుకున్నారు. కార‌ణం ఏదైనా హౌస్ ఫుల్ లాంటి క్రేజీ ఫ్రాంచైజీలో ఒక తెలుగు హీరో అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం అన్న‌దేబిగ్ స‌ర్‌ప్రైజ్‌. 

అందుకే అందివ‌చ్చిన అవ‌కాశాల్ని భ‌ళ్లాలుడు ఓ ప‌ట్టు ప‌డుతున్నాడ‌ని అర్ధ‌మ‌వుతోంది. బాలీవుడ్ స్టార్ ఫిలింమేక‌ర్స్ సాజిద్ న‌డియావాలా- ఫ‌ర్హాద్ సామ్జీల‌తో రానాకు ఉన్న సాన్నిహిత్యం ఈ ఛాన్స్ వ‌రించ‌డానికి కార‌ణ‌మైంది. ఇప్ప‌టికే కిలాడీ అక్ష‌య్‌తో క‌లిసి న‌టించాడు కాబ‌ట్టి రానాకి సులువుగా లైన్ క్లియ‌రైంది. హౌస్ ఫుల్ 4 చిత్రీక‌ర‌ణ పూర్త‌యి నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేసుకుంటోంది. త్వ‌ర‌లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ సినిమాలో రానా నెగెటివ్ షేడ్స్ అన్న పాత్ర‌లో న‌టించాడ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. అయితే దీనిపై రానా ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించలేదు. తాజాగా ఓ చిట్ ఛాట్‌లో హౌస్‌ఫుల్ సెట్స్‌లో త‌న అనుభ‌వాల గురించి  రానా చెప్పాడు. కిలాడీ అక్ష‌య్ కుమార్‌తో సెట్స్‌లో ఎంతో కిలాడీ అక్ష‌య్ కుమార్‌తో సెట్స్‌లో ఎంతోఫ‌న్నీగా సాగిపోయింద‌ని.  షూటింగ్ అనే కంటే ఒక పార్టీలా ఎంజాయ్ చేశామ‌ని రానా ఆన్ చిత్రంలో  తొలి ఆప్ష‌న్ రానా కానే కాదు. కానీ ఊహించ‌ని విధంగా అవ‌కాశం ద‌క్కింద‌ని..ఈ అవ‌కాశాన్ని వ‌దులుకోలేక‌పోయాన‌ని రానా వెల్ల‌డించాడు!!


మరింత సమాచారం తెలుసుకోండి: