టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కావడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది...ఇప్పుడు అదే లిస్ట్ లో టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ మూవీ 'అర్జున్ రెడ్డి' కూడా హిందీ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే, తెలుగులో అర్జున్ రెడ్డి ని దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ దర్శకత్వం వహించాడు, యంగ్ హీరో షాహిద్ కపూర్, కియారా అధ్వాని జోడిగా నటించారు, జూన్ 21 న రిలీజైన ఈ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.


ఫస్ట్ డే 20.21 కోట్ల కలెక్షన్స్ సాధించింది, షాహిద్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ డే మూవీ గా నిలవటమే కాకూండా, ఖాన్ త్రయం కి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్ ను షాహిద్ సాధించాడు, అంతే కాకుండా 2019 లోనే టాప్ త్రీ ఓపెనింగ్స్ సాధించిన మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ జాయిన్ అయింది, సినిమా పై నెగెటివ్ రివ్యూస్-టాక్స్ వచ్చిన అవేమి లెక్క చేయని బాలీవుడ్ ఆడియన్స్ సినిమా పై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు, హాలిడే-నాన్ హాలిడే అనే తేడాలేకుండా 'కబీర్ సింగ్' రోజు రోజుకు వసూళ్ళ జోరు కొనసాగిస్తున్నాడు, అంతే కాకుండా క్రిటిక్స్, ట్రేడ్ పండితులను ఊహకు అందని వసూళ్లతో ఆచ్చర్యనికి గురిచేస్తుంది.


ఇక ఈద్ కానుకగా రిలీజైన సల్మాన్ ఖాన్ "భారత్' మూవీ కి కబీర్ గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పాలి, లేటెస్ట్ గా కబీర్ సింగ్ 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది, ఇంకా బాక్సాఫీస్ దగ్గర మూవీ మంచి వసూళ్లను రాబడుతుంది,ఇలానే కొనసాగితే మూవీ 300క్రోర్స్ ఈజీగా దాటుతుందనే అంచనాలు కూడా వున్నాయి, ఈ మూవీ తో షాహిద్ కపూర్ కెరీర్ టాప్ స్టేజ్ కి చేరుకుందనే చెప్పాలి, షాహిద్ బిగ్గెస్ట్ సోలో హిట్ అవ్వటమే కాకుండా అతని కెరీర్లో ఈ మూవీ ఒక మైలురాయి గా నిలిచిపోతుందనే చెప్పలి , ఇక హీరోయిన్ గా నటించిన కియారా అధ్వాని బాలీవుడ్ లో ఫామ్లోకి వచ్చిదనే చెప్పుకోవాలి, తన కెరీర్ హిందీలో స్టార్ట్ అయిన టాలీవుడ్ ఆమెకు స్టార్ డమ్ తీసుకువచ్చింది, ఈ మూవీ హిట్ తో కియారా బాలీవుడ్ లో తన రెమ్యునరేషన్ ని భారీ గా పెంచిందనే టాక్ కూడా బి టౌన్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.


ఇక దర్శకుడిగా టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి వంటి సూపర్ సెన్సేషనల్ హిట్ తో తన కెరీర్ మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా ...కబీర్ సింగ్ హిట్ తో బాలీవుడ్ లో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ ఫీట్ ని అందుకున్నాడు, బాహుబలి,బాహుబలి-2 మూవీ తో దర్శక దిగ్గజం రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమను నార్త్ ఇండస్ట్రీ కి తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు....ఇప్పుడు కబీర్ సింగ్ తో సందీప్ రెడ్డి మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరోస్థాయికి

తీసుకెళ్లాడు...ఈ మూవీ తో సందీప్ కి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి, సందీప్ డైరెక్షన్ లో నటించేందుకు యువ హీరోలతో పాటు, స్టార్ హీరోలు లైన్ లో వెయిట్ చేస్తున్నారని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది, అంతే కాకుండా కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ మూవీ వుండబోతుందనే ఓ టాక్ కూడా వినిపిస్తోంది, ఏది ఏమైనా కబీర్ సింగ్ హవా బాలీవుడ్ నే కాకుండా టోటల్ నేషన్ ని తన వైపు తిప్పుకునేలా చేసిందనే అనుకోవచ్చు...మరి వసూళ్ల జోరు ఇలానే కొనసాగితే ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ ని ఈ మూవీ క్రియేట్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: