ప్రతీ శుక్రవారం  సినిమాలు విడుదలవుతుంటాయి. ఏ సినిమాలో అయినా ఏదో ఒక అంశం ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. ఆకర్షించేలా ఉండాలని దర్శకులు కోరుకుంటారు. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో చెడునే ఆకర్షించే అంశంగా చూపిస్తున్నారు. సహజంగా మంచి కన్నా చెడు మీదే ఎక్కువగా ఆసక్తి  ఉంటుంది. అందుకే ట్రైలర్ లలో బూతులు పెట్టడమో, అతిగా రొమాన్స్ చూపించడమో చేసి ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.


నటి అమలాపాల్ నటించిన ఆమె చిత్ర ట్రైలర్ లో కూడా ఇదే కనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక సీన్ లో అమలాపాల్ నగ్నంగా నటించింది. టీజర్ లో ఆ షాట్ చూపించి షాక్ కి గురి చేసారు. అమలాపాల్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. రామ్ చరణ్ తో "నాయక్ " సినిమాలో, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాల్లో నటించింది. ఇంతవరకు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించలేదు. అమలాపాల్ లీడ్ రోల్ లో నటించిన మొదటి చిత్రం ఆమె


తమిళంలో రూపొందించిన "అడై" సినిమాను ఆమె పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఎటువంటి ఆర్భాటం లేకుండా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం టీజర్ విడుదలతో ఒక్కసారిగా అందరినీ ఆకర్షించింది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక పరిధికి మించి ఎక్స్ పోజింగ్ చేయలేదు. అటువంటిది బట్టలు లేకుండా నగ్నంగా నటించింది అనేసరికి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.


నగ్నంగా నటించే సీన్ కోసం అమలాపాల్ కొన్ని రోజులు బట్టలు లేకుండా నటించాల్సి వచ్చిందట. తెలుగులో అంతగా గుర్తింపు లేని అమలాపాల్  కి ఈ సినిమాతో పేరొస్తుందో లేదో చూడాలి. కానీ సినిమా పట్ల ఆకర్షితులు కావడాని బట్టలు లేకుండా నటించే సీన్ చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. మరి సినిమా కథ ఎంత వరకు ఆకట్టుకుంటుందనేది తెలుసుకోవాలంటే ఈ నెల 19 వరకు వెయిట్ చేయాల్సిందే. వి స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి "రత్నకుమార్ దర్శకత్వం వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: