తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న చియాన్ విక్ర‌మ్ ఎప్పుడూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీసుకుంటూ సినిమాలు చేస్తారు. అపరిచితుడు, ఐ, శివపుత్రుడు, ఇరుముర‌గ‌న్ (తెలుగులో ఇంకొక్క‌డు) వంటి సినిమాలు విక్ర‌మ్‌కు తెలుగులో కూడా మంచి పేరు తీసుకువ‌చ్చాయి. అలాగే మ‌రో సారి అదే ఫామ్‌లో మ‌రో డిఫ‌రెంట్ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిస్తున్న చిత్రం “మిస్ట‌ర్ కెకె”.


ఈ నెల 19న ఈ చిత్రం టి.అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి.నరేష్‌కుమార్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. తాజాగా రిటీజ్ అయిన ఈ సినిమా ట్రైల‌ర్‌లో విక్రమ్‌ గెటప్‌, లుక్ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే ‘యాక్షన్‌ ప్రధానంగా సాగే థ్రిల్లర్‌ చిత్రమిది. ఎలాంటి సవాళ్లనైనా అవలీలగా ఎదుర్కొనే సమర్థవంతమైన కమాండర్‌గా విక్రమ్‌ కనిపిస్తారు. అలాగే అక్షర హసన్‌ కూడా పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలో కనిపిస్తుంది. 


సినిమా కొంత భాగం జరిగే వరకు విక్రమ్ అసలు హీరోనా విలనా అనేది ప్రేక్షకులకు అంతుపట్టకుండా ఉంటుందట. ఇక ఈ మూవీ మొత్తం ఒకరోజు జరిగే కథ కావడంతో కథనంగా ఎక్కడా నెమ్మదించకుండా వేగంగా సాగిపోతుంది. తాజాగా విడుద‌ల అయిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు బాగానే పెంచాయి. మ‌రి హాలీవుడ్ యాక్ష‌న్ రేంజులో తెర‌కెక్కిన ఈ సినిమా అంచ‌నాలు అందుకుందా ?  లేదా ? అన్న‌ది శుక్ర‌వారం తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: