టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో కెరియర్ వున్న సమయంలో ప్రజల కోసం మరియు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అంటూ జనసేన పార్టీని 2014 ఎన్నికల సమయంలో స్థాపించి ఆ సమయంలో చంద్రబాబు కి మద్దతు తెలిపి టిడిపి అధికారంలోకి రావటం లో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.


కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది పవన్ కళ్యాణ్ పార్టీ. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోవడంతో...ఎన్నో అంచనాలు పెట్టుకున్న జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే బెటర్ అంటూ ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు సినిమా చేస్తాను అంటే చాలా మంది నిర్మాతలు క్యూ కడతారని...పవన్ ఎంత ఆఫర్ చేస్తే అంత ఇవ్వటానికి చాలామంది ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు రెడీగా ఉన్నారని  ఫిలింనగర్ టాక్. మరోపక్క పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని చాలామంది అభిమానులు ప్రస్తుతం కోరుకుంటున్నారు.


జనసేన పార్టీని ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు కూడా అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు చేయటం ఇంకా కుదరదని ఒక్కసారి మాట తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉన్న జీవితం ప్రజా పోరాటం కోసమే ఉందని...కట్టే కాలే వరకు..జనసేన పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తాను అంటూ చెప్పటం జరిగింది. మరోపక్క అభిమానులు మాత్రం పవన్కళ్యాణ్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక తీరుస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: