బాలీవుడ్‌లో మోనోపలీ చేస్తోన్న కరణ్‌ జోహార్‌ 'బాహుబలి' చిత్రాన్ని హిందీకి తీసుకెళ్లడం వల్ల తెలుగు సినిమాలన్నిటికీ తానే గేట్‌ వే అన్నట్టు బిహేవ్‌ చేస్తున్నాడు. తెలుగు చిత్రాల అనువాద హక్కులకి, రీమేక్‌ హక్కులకి చిల్లర ఆఫర్‌ చేయడం, తనతో పని చేస్తే మీకే లాభమన్నట్టు మాట్లాడడం చేస్తుంటాడు. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో హిందీ సినిమా తీస్తానని చెప్పి అతనికి దారుణంగా అయిదు కోట్లు ఆఫర్‌ చేసాడు! దాంతో ప్రభాస్‌ అతనితో వ్యాపార లావాదేవీలేవీ పెట్టుకోవడం లేదు. సాహో హిందీ వెర్షన్‌ కూడా వేరే నిర్మాతల చేతిలో పెట్టాడు. 


తాజాగా 'జెర్సీ' రీమేక్‌ కోసం కరణ్‌ జోహార్‌ బాగానే ట్రై చేసాడు. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీకి మరీ తక్కువ అమౌంట్‌ ఆఫర్‌ చేసి, అవుట్‌రైట్‌ హక్కులు అడిగాడు. తప్పకుండా జెర్సీ రీమేక్‌ తనదే అనుకుంటూ కొందరు హీరోలతో కూడా డిస్కషన్లు చేసాడు. 


కానీ హిందీలో కరణ్‌ లేకపోతే తాము తీయలేమా అంటూ దిల్‌ రాజు, అల్లు అరవింద్‌ ఈ చిత్రం హిందీ రీమేక్‌ హక్కులు తీసుకుని అసలు నిర్మాత నాగవంశీకి కూడా వాటా ఇచ్చారు. ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు హిందీ మార్కెట్‌ మీద దృష్టి పెట్టారు. తెలుగు హీరోలలో చాలా మంది నార్త్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ వుండడంతో మన నిర్మాతలు ముంబయిలో బ్రాంచిలు తెరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: