తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసత్వంతో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు, ఆ తరువాత కొన్నాళ్ళు విరామం తీసుకుని ఆపై 1999లో రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు అయన నటించిన తొలి సినిమానే సూపర్ హిట్ అవడంతో పాటు, ప్రేక్షకుల గుండెల్లో ప్రిన్స్ గా చెరగని ముద్ర వేసిన మహేష్ బాబు, అక్కడినుండి అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. 

ఆ తరువాత కొన్నాళ్ళకు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ కు అమ్మాయిల్లో ఉండే క్రేజ్ కి అద్దంపట్టేలా అష్టాచమ్మా అనే సినిమా తీయడం, అది మంచి విజయాన్ని అందుకోవడం జరిగాయి. ఇక మహేష్ క్రేజ్ కేవలం టాలీవుడ్ కె పరిమితం కాలేదు, అటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఎందరో అభిమానులు, ముఖ్యంగా హీరోయిన్స్ లో మహేష్ బాబుకు మాత్రమే ఉండే క్రేజ్ ఒకింత ప్రత్యేకమని చెప్పాలి. శ్రద్ధ కపూర్ మొదలుకొని ప్రస్తుతం గోపీచంద్ సరసన చాణక్య సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న జరీన్ ఖాన్ వరకు అందరూ అయన అభిమానులే. 

ఇప్పటివరకు తెలుగు తప్పించి మరొక భాషలో కనీసం ఒక ప్రత్యేక పాత్రలో కూడా నటించని మహేష్ బాబుకు ఇంతిదిగా లేడీస్ ఫాలోయింగ్ ఉండడడం ఎంతో ఆశ్చర్యం అనే చెప్పాలి. ఒకప్పుడు కింగ్ నాగార్జునకు ఇంతలా లేడీ ఫ్యాన్స్ మరియు హీరోయిన్స్ లో క్రేజ్ ఉండేదని, ఇక ఇప్పటి హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంతటి క్రేజ్ ని సంపాదించారని, అయితే ఈ విషయంలో మహేష్ తరువాతే ఎవరైనా అని అంటున్నారు విశ్లేషకులు. ఎంతైనా సూపర్ స్టారా మజాకానా మరి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: