రాశి ఖన్నా, 'లోహాలు గుస గుస లాడే' తో మంచి ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటీ, తన అందం తో, తన అభినయం తో అందర్నీ ఆకట్టుకుంది. ఆ సినిమా తరవాత, బడా స్టార్స్ అయినా, ఎన్టీఆర్, రవితేజ ల సరసన నటించింది కూడా. అయితే, ఎందుకని గాని పెద్ద స్టార్స్ తో నటించినా, పెద్ద హిట్స్ లేవు, జై లవ కుశ అని, రవితేజ తో బెంగాల్ టైగర్ గాని, రీసెంట్ గా వచ్చిన 'తొలి ప్రేమ' కూడా తనని స్టార్ హీరోయిన్ స్టేటస్ కి తీస్కెళ్లలేకపోయాయ్.


దీనికి తోడు, సోషల్ మీడియా లో కొంచెం బొద్దు గ ఉండే రాశి పైన, తన బాడీ పైన ట్రోల్ల్స్ రావడం మొదలెట్టాయి. రాశి ప్రస్తుతం నాగ చైతన్య, వెంకటేష్ ల మల్టీ స్టార్రర్ లో నటిస్తోంది. కాగా, ఇటీవల కలం లో ఈ బ్యూటీ తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకుంటోంది.


ఈ బ్యూటీ కి సీక్రెట్ ఏంటని అడగగా, "నేను జిమ్ కి రెగ్యులర్ గా వెళ్లి, వర్కౌట్ చేస్తాను, కానీ ఫలితాలు వెంటనే రావు, అలాగని నేను డైటింగ్ ఏమి చెయ్యను. నాకు ఈ స్లిమ్ బాడీ రావటానికి రెండు సంవత్సరాలు పట్టింది. దీనికి తోడు, మంచి హెల్త్య్ ఫుడ్, అంటే, కార్బన్ తో, ప్రోటీన్స్ తీసుకుంటాను, దానికి తోడు, ఎప్పుడు నవ్వుతు ఉంటాను" అని సమాధానం ఇచ్చింది.


'వెంకీ మామ' లో తన రోల్ గురించి చెప్తూ," ఈ సినిమా లో ఈ రోల్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది, నేను ఒక డైరెక్టర్ రోల్ ప్లే చేస్తున్నాను, ఏదంటే అదే జరిగిపోవాలి అనే మోడరన్ చరక్టర్ నాది. నా లుక్ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది, నా డ్రెస్ స్టైలింగ్ అన్ని డిఫరెంట్ గా, మోడరన్ గా ఉండబోతున్నాయి, పైగా కామెడీ నా ఫేవరెట్, చాలా బాగా వస్తోంది, ఈ సినిమా ఒక మామ అండ్ అల్లుడు మధ్య రిలేషన్స్ ని ఒక మంచి ఎంటర్టైనర్ రూపం లో చెప్తుంది, ఇది రాజముండ్రి లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది" అని మురిసిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: