ఇంకేమ్ ఇంకేమ్ ఇంకేమ్ కావాలే.. అంటూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న "గీతాగోవిందం" చిత్రంలో నటించిన ఫేమస్ హీరో, హీరోయిన్ మళ్లీ ఇంకో సరికొత్త చిత్రం "డియర్ కామ్రేడ్" తో ప్రేక్షకులను అలరించేందుకు రానున్నారు.


నిన్న జరిగిన డియర్ కామ్రేడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, రౌడీస్ జీవితంలో భయపడితే సాధించేది ఏమీ లేదు భయాన్ని వీడండి తప్పకుండా విజయం సాధిస్తాం, భయం విడిచిపెడితే సక్సెస్ మనదే అంటూ ప్రేక్షకులలో ఇంకొంచెం జోష్ ను పెంచాడు.


తను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావటమే కాకుండా ఈ ఈవెంట్ లో ఒక యాంకర్ గా,ఒక సింగర్ గా,ఒక డాన్సర్ గా కూడా చేసి తన ఫ్యాన్స్ ను ఎంతగానో అలరించారు. డియర్ కామ్రేడ్ చిత్రం ఈ నెల 26న విడుదల కానుందని చెప్తూ నేను కూడా యాక్టర్ అవుతున్నాననే భయం ఉండేది.


ఇదే కాక ఈ రోజు ఈ మ్యూజికల్ ఫెస్ట్ లో అనుకున్నాము కానీ ఈ ఈవెంట్ ఎలా చేస్తామో అనే భయం ఉండేది. కాని వీటన్నింటిని అధిగమించి ఇలా మీ ముందుకు ఉన్నానంటే దీనికి మీ ప్రోత్సాహం మీరు మాపై చూపించే ప్రేమాభిమానేలే కారణమని ఎంతో భావోద్వేగానికి లోనైయ్యారు మన రౌడీ ఫెలో విజయ్ దేవర్ కొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: