Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 5:50 am IST

Menu &Sections

Search

జిగర్తాండ హిందీ రీమేక్ లో తమన్నా నటించేది అనుమానమే

జిగర్తాండ హిందీ రీమేక్ లో తమన్నా నటించేది అనుమానమే
జిగర్తాండ హిందీ రీమేక్ లో తమన్నా నటించేది అనుమానమే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళంలో సూపర్ హిట్ సాధించిన గ్యాంగ్ స్టర్ కామెడీ చిత్రం జిగర్తాండ హిందీలో కూడా రీమేక్ అవుతుంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో గా సిద్ధార్థ్, హీరోయిన్ గా లక్ష్మీ మీనన్ నటించారు. తమిళంలో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన బాబీ సింహాకి, ఎడిటింగ్ చేసిన వివేక్ హర్షన్ కి జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది.


2014 లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుంది. నటుడు అజయ్ దేవ్ గణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జిగర్తాండ సినిమాలో బాబీ సింహా క్యారెక్టర్ ని హిందీలో సంజయ్ దత్ చేస్తున్నారు. హీరోయిన్ లక్ష్మీమీనన గా తమన్నాని, సిద్ధార్థ్ క్యారెక్టర్ గా ఫర్హాన్ అక్తర్ ని అనుకున్నారు. ఉడ్తా పంజాబ్ ఫేమ్ అభిషేక్ చౌబే ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.


అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త బయటకు వచ్చింది. లక్ష్మీ మీనన్ పాత్రలో తమన్నా చేయడం లేదని అంటున్నారు. అలాగే ఫర్హాన్ అక్తర్ కి బదులు కార్తీక్ ఆర్యన్ చేయబోతున్నాడని సమాచారం. నటీనటులు ఎందుకు మారారనేది తెలిసి రాలేదు. దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు. కాకపోతే, తమన్నాకి ఈ రీమేక్ లో నటించడం ఇష్టం లేకపోవడం వల్లనే తప్పుకుందని అంటున్నారు
.
అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ తమన్నా సినిమా చేయకపోవడం చర్చనీయాంశం అయింది. అదీ గాక తమన్నాకి తెలుగు తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈ  సినిమా చేయకపోవడం వల్ల ఆమెకి నష్టం ఉండదని అనుకుంటున్నారు. జిగర్తాండ సినిమాని తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో " వాల్మీకి"గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


tamannah
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అల వైకుంఠ పురములో.... నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్
బ్యాడ్ బాయ్ పాటకు జాక్వెలిన్ ఎంత తీసుకుందో తెలుసా?
తన అనారోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమితాబ్
పునర్నవి, వరుణ్ లు రాహుల్ ని నామినేట్ చేయడం వెనక అసలు కారణం
ఆలీ, మహేష్ మధ్య జరిగిన గొడవలో మహేష్ తప్పు చేశాడా?
మరో సినిమాని మొదలుపెట్టిన యంగ్ డైరెక్టర్
గెలుస్తామని చెప్తే ఈ ప్రపంచం వినదు. గెలిచి చెప్తేనే వింటుంది...కౌసల్య క్రిష్ణముర్తి
గేమ్ ప్లాన్ ని మార్చిన శ్రీముఖి .మహేష్ బలి.
బాబా భాస్కర్ కి ఆలీ చేసింది నమ్మక ద్రోహమేనా?
సిద్ధాంతం కోసం 10 కోట్ల ఆఫర్ ని వదులుకున్న నటి
రాహుల్, పునర్నవి ల బంధం తెగిపోనుందా?
బిగ్ బాస్ లో వాళ్ళింకా మాస్క్ వేసుకునే ఉన్నారా?
వెళ్తూ వెళ్తూ రోహిణి ఆ ఒక్క విషయంలో తప్పు చేసిందా?
డూప్ నటులు కావలెను....రామ్ గొపాల్ వర్మ
బాలీవుడ్ లో న్యూడ్ సీన్స్ ఇప్పుడు పెద్ద విషయమే కాదు...మల్లికా షెరావత్
బాలయ్య సినిమాలో వేడి పుట్టించనున్న సోనాల్ చౌహాన్
మొదటిసారిగా యాడ్ లో కనిపించిన నాని
ఛోటా హీరోపై కత్తి దూసిన కత్తి మహేష్
పూరి జగన్నాథ్ విజయ్ తో చేసే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ లో నాగార్జున చేసిన పొరపాట్లు చేసాడా?
రాహుల్ ని  చీవాట్లు పెట్టిన నాగార్జున
బాలీవుడ్ సినిమా తమిళంలోకి
రాహుల్, పునర్నవిలు అందుకే అలా చేస్తున్నారా?
బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ఈ వారం టఫ్ కాంపిటీషన్
ఎవరు చిత్రానికి రాఘవేంద్రుడి ప్రశంసలు
మా ఇంట్లో తనే ఎక్కువగా అల్లరి చేస్తుంది..... నాగార్జున
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.