తెలుగులో అతి పెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ ఉంది. రెండేళ్ళ క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ వన్ చాలా దూకుడుగా సాగింది. యంగ్ అండ్  ఎనర్జటిక్  హీరో జూనియర్  ఎన్టీయార్ హోస్ట్ గా దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఇక తరువాత వచ్చిన బిగ్ బాస్ -2 ని నాచురల్ స్టార్  నాని హోస్ట్ చేశాడు. తన వరకూ బాగా చేశాడు కూడా.


నాని మీద అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎన్టీయార్ పెట్టిన బెంచ్ మార్క్ ని రీచ్ కాలేకపోయాడని కూడా ఫీల్ అయ్యారు. ఇక సీజన్ వన్ లో ఉన్న కన్సిస్టెంట్ల కంటే 2 లో వచ్చిన వారు పెద్దగా పరిచయం లేని వారని కూడా కామెంట్స్ వచ్చాయి.


ఇపుడు బిగ్ బాస్ 3 వచ్చింది. పదిహేను మంది పేరుకు ఉన్నారు. కానీ ఇందులో సగానికి సగం తెలియని వారే. దాంతో ఇంటెరెస్ట్ అన్నది మొదటే కట్ అయ్యే పరిస్థితి. ఇక బిగ్ బాస్ 3 ని సక్సెస్  చేయాల్సిన బాధ్యత మాత్రం హోస్ట్ అయిన  నాగార్జునదే.  అయితే ఆయన సైతం తొలి షో నుంచే హుషార్ చేస్తున్నా గత రెండు సీజన్ల మాదిరిగా పోలికలు తెస్తున్నారు. ముందు ముందు చూడాలి మరి హిట్ అవుతుందో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: