ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరి జగన్నాథ్ ఈమధ్య వరుస ఫ్లాపులు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా రిలీజైన ఇస్మార్ట్ శంకర్ మాత్రం అతనికి మంచి హిట్ ఇచ్చింది. దర్శకుడిగా పూరి మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే సినిమాగా ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ జోష్ అందించింది. ఇక ఈ సినిమా తర్వాత పూరి స్టార్ సినిమాలు చేస్తాడా అంటే ఏమో చెప్పలేం అంటున్నారు.


తను హిట్లు కొడుతున్నప్పుడే స్టార్స్ అవకాశాలు ఇస్తారంటూ మహేష్ ను ఎక్సాంపుల్ గా తీసుకుని మహేష్ కన్నా ఆయన ఫ్యాన్సే బెటర్ అని పూరి చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే లేపాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ జోష్ లో ఉన్న పూరి తన తర్వాత సినిమా విజయ్ దేవరకొండతో చేసే ఆలోచనలో ఉన్నాడట.


అదికూడా మహేష్ తో అనుకున్న జనగణమన సబ్జెక్ట్ నే విజయ్ తో చేసేందుకు ఫిక్స్ అయ్యాడట. హిట్లు ఉంటేనే స్టార్స్ ఛాన్స్ లు ఇస్తారంటే వాళ్లను నమ్మి కోట్లకు కోట్లు పెడుతున్నారు. మరి అలాంటప్పుడు హీరోలు కూడా రిస్క్ తీసుకునే అవకాశం ఉండదు కదా. మరి ఈ లాజిక్ పూరి ఎలా మిస్సయ్యాడో ఏమో. 


మహేష్ కాదన్న జనగణమనను విజయ్ తో చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు పూరి. మరి పూరి రిక్వెస్ట్ ను మహేష్ యాక్సెప్ట్ చేసి అతనితో సినిమా చేస్తాడా లేక ఆ సినిమా వదులుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: