స్టార్లూ, సూపర్ స్టార్లు మధ్యన  యుధ్ధం ఎపుడూ సైలెంట్ గానే ఉంటుంది. అది బయటపడదు, అవతలి వారు ఒక హిట్ ఇస్తే ఇక్కడ హీట్ మొదలవుతుంది. హిట్ కొట్టేవరకూ ఆ వేడి తగ్గదు. పైకి నవ్వులు రువ్వుకుంటున్నా లోపల లావా అలా రగిలిపోతూనే ఉంటుంది.


ఇపుడు టాలీవుడ్లో టాప్ హీరోల కధ పక్కనపెడితే మిడిల్ రేంజి హీరోలు ఉన్నారు. వారు మధ్యన సెగలు, పొగలు రగులుతున్నాయంట. ఇందులో మంచి  ఫాం లో ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోల నుండి  స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వారి వరకూ అందరూ అవకాశాల గురించే కలవరపడుతున్నారుట.


ఓ డైరెక్టర్ మంచి  కధ చెబితే దాన్ని లాక్ చేసేస్తున్నారుట. చేతిలో సినిమా ఉంటే ఆ డైరెక్టర్ ఖాళీగా కూర్చోడుగా మరో మిడిల్ రేంజి హీరోకు చెబుతున్నాడు. దాంతో ఇక్కడ కధ అక్కడ సినిమాగా వస్తోంది. కొంపదీసి అది హిట్ అయిందా ఇక ఈ హీరోల మధ్యన మంటలే రాజుకుంటున్నాయి.


దీంతో కధలు చెప్పడానికి వెళ్తున్న డైరెక్టర్లకు టార్చర్లు మొదలవుతున్నాయట. తమతోనే మూవీ చేయాలని కండిషన్ పెడుతున్నారుట. మరి ఆ హీరోకు తీరిక లేకపోతే మరో హీరోను వెతుక్కోవడం డైరెక్టర్ చేసే పని. అది కూడా వద్దంటే ఎలా. . అయితే ఇదంతా తమ ఫ్యూచర్ కోసమేనని హీరోలు అంటున్నా హిట్లు లేక అలమటిస్తున్న మిడిల్ రేంజి నటులకు ఇపుడు పోటీ బాగా పెరిగింది. దాని నుంచే ఈ పోరు కూడా మొదలైందని అంటున్నారు.


టాప్ పొజిషన్లో విజయ్ దేవరకొండ, తరువాత వరుణ్ తేజ్ ఉంటే, మజిలీతో నాగ చైతన్య, తాజాగా ఇస్మార్ట్ శంకర్ హిట్ తో రాం కూడా ఇపుడు హాట్ ఫేవరేట్ అయ్యాడు. ఇక హిట్లు, ఫట్లు మధ్య నలుగుతున్న నితిన్, సాయి ధర్మ తేజ్ లాంటి వారు మంచి కధల కోసం దైరెక్టర్ల వెంట పడుతున్నారట. ఆ మధ్యన సందడి చేసిన నాని ఇపుడు రేసులో ఏ పొజిషన్ అన్నది చూదాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: