సౌత్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ క్రేజ్ ఏర్పరుచుకుని..సౌతిండియా ప్రేక్షకులను దయ్యాల టాప్ హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా కాజల్ అగర్వాల్ ఇక్కడ ఉన్న క్రేజ్ నీ ఉపయోగించుకుని బాలీవుడ్ లో అవకాశాల కోసం తెగ వెంపర్లాడరు. చివరాకరికి చేతులు కాల్చుకుని చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాక లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ పై ఆశలు పెట్టుకొని ప్రస్తుతం సౌత్ లో మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఇదే బాటలో వీరిద్దరి అనుసరిస్తూ తాజాగా కీర్తి సురేష్ కూడా రెడీ అవుతున్నట్లు సౌత్ లో వార్తలు వినబడుతున్నాయి.


విషయంలోకి వెళితే అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను దక్కించుకుంది కీర్తి సురేష్. టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమా తో అద్భుతమైన ప్రశంసలను అందుకొంది తిరుగులేని నటిగా పేరు దక్కించుకుంది.


ఇటువంటి క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడం కోసం తన దగ్గరికి సౌత్ సినిమాలు వస్తున్నా కానీ రిజెక్ట్ చేస్తూ మరోపక్క బాలీవుడ్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ త్వరలో శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మించబోయే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రం కోసం ఒళ్ళు హూనం చేసుకుని బక్కచిక్కిపోయింది. ఇకపై బాలీవుడ్ చిత్రాల్లో నటించడం కోసం ముంబైలోనే ఉండాలని కీర్తి సురేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న అవకాశాలు వదిలేసి బాలీవుడ్ లో ఇబ్బందులు పడడం ఎందుకనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: