ప్రస్తుతం అటు బుల్లితెరతో పాటు, వెండితెరపై కూడా తన ఆకట్టుకునే నటనతో దూసుకుపోతున్న నటి, యాంకర్ అనసూయ. వాస్తవానికి తొలుత ఒక న్యూస్ ఛానల్ లో చిన్న షో ద్వారా టెలివిజన్ రంగంలోకి ఎంటర్ అయిన అనసూయ, అపై మెల్లగా తన టాలెంట్ తో వరుసగా టివి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ఆమెకు యాంకర్ గా ఎనలేని గుర్తింపుని తీసుసుకువచ్చింది. 

ఆపై ఆమెకు మెల్లగా సినిమా అవకాశాలు కూడా రావడం, వాటిని ఆమె సద్వినియోగం చేసుకోవడం జరిగిపోయాయి. ఇక ప్రస్తుతం ఆమె కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ తో పాటు సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. అయితే నిన్న ఎంతో వైభవంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3లోని పార్టిసిపెంట్స్ లో యాంకర్ శ్రీముఖి కూడా ఉండడంతో ఆమె అభిమానులు ఎంతో సంబరపడుతూ సోషల్ మీడియా వేదికల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయమై అనసూయ ఫ్యాన్స్ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అనసూయ గారికి యాంకర్ గా మరియు నటిగా మంచి అనుభవం మరియు పేరుందని, అయినప్పటికీ బిగ్ బాస్ లో ఆమెను తీసుకోకపోవడం పై వారు నిరసన వ్యక్తం చేస్తూ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారట. 

అయితే ఇటీవల అనసూయకు కూడా బిగ్ బాస్ షో నుండి అహ్వానం లభించిందని, కానీ ఆమె తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు డేట్స్ ఎప్పుడో కేటాయించడం జరిగిపోవడంతో, బిగ్ బాస్ లో పాల్గొనలేనని నిర్వాహకులకు తేల్చిచెప్పినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, తమ అభిమాన నటికి బిగ్ బాస్ లో ప్లేస్ దక్కనందుకు మాత్రం ఆమె ఫ్యాన్స్ ఎంతో బాధపడిపోతున్నారట. మరి వారి బాధను తీర్చేందుకు అనసూయ రాబోయే బిగ్ బాస్ సీజన్ లో అయినా పాల్గొంటారేమో వేచి చూద్దాం......!!


మరింత సమాచారం తెలుసుకోండి: