ట్రెండ్ మారినా.. పూరీ జగన్నాథ్ ఏజ్ మారినా.. ఆయన ఎంచుకునే కథల్లో రఫ్ అండ్ బోల్డ్ నెస్‌ మాత్రం పోవడం లేదు. ఊర మాస్ అంతకు మంచిన మసాలా సీన్స్‌తో యూత్‌ని ఎట్రాక్ట్ చేసే పూరీ జగన్నాథ్ భక్తిరసచిత్రాన్ని చేస్తున్నారట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. భక్తి చిత్రం అంటే కె. రాఘవేంద్రరావు మాదిరి ‘అన్నమయ్య’ కాదు.. ఇది పూరీ మార్క్ మూవీ. దేవుడ్ని మొక్కొద్దని’ సినిమా తీస్తా. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందంటున్నారు పూరీ జగన్నాథ్. 


‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న పూరీ జగన్నాథ్‌లో ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో తాను భక్తి చిత్రం తీయబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేవుడ్ని మొక్కొద్దు అని సినిమా తీస్తా. స్క్రిప్ట్ కూడా రెడీ ఉంది. ఎప్పటి నుండో ఈ సినిమా తీయాలని ఉంది. దేవుడి కాళ్లపై పడి మొక్కడం లాంటివి అందరూ తీసిన సినిమానే. నేను దేవుడ్ని మొక్కడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అన్న పాయింట్‌లో కథను రాశా. 


నేను మనుషుల్ని నమ్ముతా.. మనిషే హెల్ప్ చేస్తాడు. దేవుడు హెల్ప్ చేయడని నమ్మే మనిషిని నేను. అయితే అప్పుడప్పుడూ ద్వేషిస్తూ ఉంటాము. అలా అని అందర్నీ ప్రేమించలేం. నన్ను ద్వేషించే వాళ్లు ఉంటారు.. ప్రేమించే వాళ్లు ఉంటారు. నా నుండి ఎంత మంది దూరం అయితే అంత బాగుంటానని నమ్ముతా. నన్ను అందరూ వదిలేసి పోతే బాగుండు అనుకుంటా. ఎవరూ లేకపోతే హ్యాపీగా బతకొచ్చు. చుట్టూ ఉన్న వాళ్లు మన పని మనల్ని చేసుకోనీయరు. ఎదిగే కొలదీ మనల్ని తొక్కడానికి చూస్తారు. మనం అడుక్కుని తింటుంటే ఎవరూ మీ వైపు చూడరు. పీక్కు తినే వాళ్లు ఎక్కువ. ఇది నా చుట్టూ ఉన్న వాళ్ల నుండి నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది ఇదే. 


కొన్ని కోట్లు సంపాదించిన నేను చేతిలో లక్ష రూపాయలు కూడా లేకుండా ఉండే పరిస్థితిని ఎదుర్కొన్నా. అప్పుడూ హ్యాపీగానే ఉన్నా. కాకపోతే బాధపడ్డా. సున్నా నుండి మళ్లీ మొదలయ్యా. అలాంటి టైంలో.. నాకు తోడుగా ఉన్నది నా భార్య మాత్రమే. ఇండస్ట్రీ నుండి సపోర్ట్ రాలేదు. పూరీ ఎలా ఉన్నావు అని అడిగే వారే తప్ప హెల్ప్ చేసే వాళ్లు కనిపించలేదు. నేను హెల్ప్ చేయమని అడిగే టైప్ కాదు’ అంటూ జీవితపాఠాన్ని చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: