విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్. గీత గోవిందం వంటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా మళ్ళీ అదే హీరో-హీరోయిన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన కామ్రేడ్ అందరికి తెలిసిన కొన్ని కారణాల వల్లే ఇంత ఆలస్యంగా థియోటర్స్  లోకి వస్తోంది. అంతేకాదు ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ..భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. అయితే నిన్నా..మొన్నటి వరకు ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సస్ ఫుల్ గా రన్నవుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాతో డియర్ కామ్రేడ్ లెక్కలు మారిపోయాయి. 

ఒక వారం తర్వాత వస్తున్నప్పటికి ఇస్మార్ట్ శంకర్ సునామీని డియర్ కామ్రేడ్ తట్టుకొని నిలబడుతుందా..? అనే అనుమానాలు అటు ప్రేక్షకుల్లోను ఇటు సినీ వర్గాల్లోనూ వస్తున్నాయి. అందుకు కారణం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ముఖ్యంగా రామ్ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉండటమే. డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్..ఇలా ప్రతీ దాంట్లో రామ్ ఇరగదీశాడు. ఇప్పట్లో ఇస్మార్ట్ శంకర్ ని ఆపడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు ఈ టైమ్ లో డియర్ కామ్రేడ్ రిలీజ్ చేయడం అవసరమా..అని కూడా చెప్పుకుంటున్నారు. అందుకు కారణం విజయ్ డియర్ కామ్రేడ్ ట్రైలర్ లో బాగా డల్ గా అనిపించడమే. 

అంతేకాదు ఈ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు అర్జున్ రెడ్డి, నోటా..ఫ్లేవర్ కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇందంతా చూస్తుంటే విజయ్ ఇస్మార్ట్ శంకర్ ని తట్టుకొని నిలబడగలడా..అనే సందేహం వస్తోంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక గాని తెలీదు ఎవరి స్టామినా ఏంటో.  అయితే మొదటి షో నుండే హిట్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్మార్ట్ శంకర్ కి డియర్ కామ్రేడ్ గట్టి పోటీ ఇచ్చినట్టే. లేదంటే నెక్స్ట్ డే నుండే విజయ్ సర్దుకోవాల్సి వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: