చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా’ సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల విషయంలో ఆలస్యం అవుతున్న క్రమంలో ‘సైరా’ సినిమా ఆలస్యం వెనుక కొత్త వార్త ఇండస్ట్రీలో వినపడుతోంది.


అదేమిటంటే సినిమాపై కొన్ని కండీషన్‌లు పెడుతుండడంతో సురేందర్ రెడ్డికి మరియు చిరంజీవికి మధ్య కాస్త భేదాభిప్రాయలు తలెత్తాయని అందుకే సినిమా విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుందని సినీ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాదు సైరా వంటి సినిమా, మరియు స్టార్ హీరో చిరంజీవి కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వాదనల ప్రకారం సురేందర్ రెడ్డి అనుభవరాహిత్యం వలన సినిమా తీయడానికి చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది.


అయితే ఇదే విషయంలోనే చిరుకు, సురేందర్ రెడ్డికి కాస్త పడడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుమూలంగా నే సినిమా ఆలస్యం అవుతున్న క్రమంలో సొంత ప్రొడక్షన్ నేపథ్యంలో డబ్బులు కూడా ఎక్కువ అవుతున్న క్రమంలో చిరంజీవి…’సైరా’ సినిమా చెయ్యాలంటే కొంత అసహనానికి గురవుతున్నట్లు ..ఈ సినిమాకి కేటాయించిన సమయం తన కెరియర్ లో మరే సినిమాకి అంత టైం పట్టలేదని సినిమా విడుదల అవటానికి ఆలస్యం పై దర్శకత్వంపై చిరంజీవి సీరియస్ గా ఉన్నట్లు ఇండస్ట్రీలో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: