యూట్యూబ్ చానెల్స్ ద్వారా బాలీవుడ్ బ్యూటీస్ బాగా సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా- యూట్యూబ్ లో యాడ్ పోస్టింగుల ద్వారానూ రెవెన్యూ అమాంతం డబుల్ అవుతోంది. అందుకే ఇప్పటికే పలువురు స్టార్లు యూట్యూబ్ చానెల్స్ తో పాటు సమాజిక మాధ్యమాల్లో స్పీడ్ గా ఉన్నారు. టాలీవుడ్ లో ఇది తక్కువే అయినా బాలీవుడ్ లో మాత్రం స్టార్లు ఎంతో అడ్వాన్స్ డ్ గా ఉన్నారు.


బాలీవుడ్ అందాల కథానాయికలు సైతం యూట్యూబ్ లో యమ స్పీడ్. బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే స్టార్ స్టక్ బిజినెస్ ని సామాజిక మాధ్యమాలు .. యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం వల్ల కోట్లాది రూపాయల బిజినెస్ సులువుగా సాగిపోతోంది. అలాగే యంగ్ బ్యూటీ ఆలియా భట్ సైతం సామాజిక మాధ్యమాలతో పాటు యూట్యూబ్ చానెల్ ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది.


తద్వారా లక్షలు.. కోట్లలో ఆదాయం కలిసి రానుంది ఈ బ్యూటీకి. అందుకే తాజాగా ఆలియా బాటలోనే మరో హాట్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ (జాకీ) సొంతంగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. `బాలీవుడ్ జర్నీలో నేర్చుకున్న కొత్త విషయాలను నా యూట్యూబ్  చానెల్ లో పంచుకుంటాను. ముఖ్యంగా ఫిట్నెస్-బ్యూటీ టిప్స్ ని షేర్ చేస్తాను. పరిశ్రమలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వారితో స్ఫూర్తి నిచ్చే కథల్ని వెలికి తీస్తాను`` అని చెబుతోంది జాకీ.

మరింత సమాచారం తెలుసుకోండి: