టాలీవుడ్ బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్నా మూవీ నుంచి పెద్దగా అప్ డేట్స్ మాత్రం రాలేదు. దాంతో ఈ సినిమాపై రక రకాల అనుమానాలు పెరిగిపోతూ వచ్చాయి. దాంతో వరుసగా సినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టారు చిత్ర యూనిట్.  ప్రస్తుతం సాహూ షూటింగ్ పూర్తి చేసుకొని ఇతర పనుల్లో నిగమ్నమైంది.  వాస్తవానికి ఈ మూవీ ఆగస్టు 15 విడుదల కావాల్సి ఉన్నా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాయిదా వేశారు. 

సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఇండియాలోని పలు భాషల్లో ఈ చిత్రాన్ని ఒకే రోజు విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ మద్య ఈ సినిమా వీడియో సాంగ్ కూడా ఇటీవల విడుదల చేశారు. దానికీ విపరీతమైన స్పందన వచ్చింది. సాహో నుంచి ఏ వార్త వచ్చినా అది ట్రెండింగ్ అవుతోంది ప్రస్తుతం. ఇప్పటికే  ఈ మూవీ నుంచి యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ కాగా, ఇప్పుడో రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు.

గ్రాఫిక్స్‌ వర్క్స్‌ భారీగా ఉండటంవల్ల అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్లే 'సాహో' విడుదల వాయిదా పడిందని చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ‘సాహూ’ ఆగస్టు30 న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. ఇప్పటికైనా ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రభాస్ థియేటర్లో దుమ్మురేపాలని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: