టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరుగాంచిన ఎన్టీఆర్, తన తాతయ్య ఎన్టీఆర్ గారు, తండ్రి  హరికృష్ణ, బాబాయి బాలకృష్ణ గారి ఆశీస్సులతో ప్రస్తుతం వరుసగా విజయాలతో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట నిన్నుచూడాలని సినిమాతో హీరోగా రంగప్రవేశం చేసిన ఎన్టీఆర్, అంతకుముందు గుణశేఖర్ దర్శకత్వంలో బాలనటుడిగా బలరామాయణం సినిమాలో నటించి నటనలో చిన్నప్పుడే ఓనమాలు దిద్దారు. ఇక హీరోగా మారాక కెరీర్ పరంగా ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన ఎన్టీఆర్ కు మధ్యలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. 2009 ఎన్నికల సమయంలో టిడిపి పార్టీని తనవంతుగా గెలిపించాలనే యోచనతో, ఆయన యాక్సిడెంట్ జరిగినా కూడ పెద్దగా లెక్కచేయకుండా టిడిపి శ్రేణులలో ధైర్యం నింపుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి మాత్రం ఓటమిపాలవడం జరిగింది. 

ఇక అప్పటినుండి ఇప్పటివరకు రాజకీయాల పట్ల దూరంగా ఉంటూ వస్తున్న ఎన్టీఆర్, మరికొద్ది రోజుల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ప్రత్యక్షంగా కాదు సుమండీ,  వేరేవిధంగానట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం లోటు బడ్జెట్ లో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ వనరుగా భావించే ఏ ఒక్క మార్గాన్నీ కూడా వదలకూడదని వైసిపి ప్రభుత్వం యోచిస్తోందట. ఇందులో భాగంగానే అతిముఖ్య రంగాల్లో ఒకటైన పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారట. అయితే, అందులో భాగంగా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైనా ప్రముఖ వ్యక్తితో ప్రచారం చేయించాలని చూస్తున్నారట. తాజాగా దీనికి సంబంధించి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించాలని కూడా వైసిపి పార్టీ యోచిస్తున్నట్లు నేడు ఓ వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. అయితే ఇప్పటికే 

జూనియర్ ఎన్టీఆర్‌ మామ గారైన నార్నే శ్రీనివాసరావుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం, అలానే ఆయనకు కీలక పదవి లభించిన విషయం తెలిసిందే. 
ప్రస్తుతం నార్నే శ్రీనివాసరావును వైసీపీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. మరోవైపు గుడివాడ ఎమ్యెల్యే కోడలి నాని కూడా జూనియర్ కు మంచి మిత్రుడు అవడంతో వీలైతే వారిద్దరిద్వారా జూనియర్ కు రాయబారం పంపి ఎలాగైనా ఒప్పించాలని చూస్తున్నారట. అవసరం అయితే ప్రభుత్వం తరపున భారీ మొత్తాన్ని చెల్లించేందుకు కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. మరి తన తాతయ్య నెలకొల్పిన టీడీపీకి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం తరపున పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తారా అనే విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ కొందరు రాజకీయ వర్గాల వారు మాత్రం ఇందులో నిజం లేకపోలేదని అంటున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: