ప్రస్తుతం తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 సీజన్ లో అప్పుడే జోష్ మొదలైంది. అప్పుడే ఇంటి సభ్యులు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు.  అక్కినేని నాగార్జున్ హూస్ట గా ఉన్న బిగ్ బాస్ 3 14 మంది ఇంటి సభ్యులు పాల్గొంటున్నారు. ఇందులో సినీ, టీవీ, సింగర్,న్యూస్ మీడియా, మోడలింగ్ కి సంబంధించిన వారిని తీసుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన ఇంటి సభ్యుల్లో హిమజ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు. హిమజ ఎక్కడి నుంచి వచ్చింది, సినీ పరిశ్రమకు ఎలా వచ్చింది అనే విషయాలపై తెగ సర్చ్ చేస్తున్నారు.

హిమజ ప్రస్తుతం టివి సీరియల్స్ లో నటిస్తుంది. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో రూ. 5000 ఉద్యోగం చేసింది.  ఉద్యోగం చేస్తున్నా ఆమె మనుసు మాత్రం నటిగా మారాలనే కోరికతోనే ఉండేదట. ఈ క్రమంలో ఆమె భార్యామణి అనే సీరియల్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత మరికొన్ని సిరియల్స్ లో వరుస ఛాన్సులు దక్కించుకుంది హిమజ.

అయితే హిమజ నటించిన సీరియల్స్ లో ‘కొంచె ఇష్టం కొంచెం కష్టం’ తో మంచి గుర్తింపు లభించిందట. దాంతో ఆమెకు వెండి తెరపై కూడా ఛాన్సులు వచ్చాయి. శివం మూవీ పనిమనిషి పాత్రలో కనిపించింది. ఆ మద్య బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘వినయవిదేయ రామ’ సినిమాలో వొదిన పాత్రలో నటించిందట. ఇప్పుడు బిగ్ బాస్ 3 షోలో సభ్యురాలిగా ఎంపికై అందరి దృష్టిలో పడింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా వుంటుంది. హిమజ బిగ్ బాస్ 3లో ఏమేరకు తోటి సభ్యులపై నెగ్గుతుందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: