మహేష్ తో సినిమా చేయాలని చాలా మంది డైరెక్టర్స్ ట్రై చేసి చివరికి భంగ పడ్డారు. మహేష్ బాబు-సుకుమార్.. వీళ్లిద్దరూ కలిసి గతంలో వన్-నేనొక్కడినే అనే సినిమా చేశారు. ఆ సినిమా ఫెయిల్ అయినా మహేష్ కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. అయితే వీళ్లిద్దరూ మరోసారి కలిసేది మాత్రం అనుమానమే. ఎందుకంటే సుకుమార్ చెప్పిన ఓ కథకు మహేష్ నో చెప్పాడు. దీంతో సుకుమార్ కు కోపమొచ్చింది. అదే స్టోరీతో బన్నీ హీరోగా సినిమా ప్రకటించాడు. దీంతో మహేష్-సుకుమార్ మధ్య గ్యాప్ పెరిగింది.

మహేష్-పూరి జగన్నాధ్... మొన్నటివరకు వీళ్లిద్దరి మధ్య ఆల్ ఈజ్ వెల్ అనుకున్నాం. కానీ రీసెంట్ గా పూరి చేసిన వివాదాస్పద ప్రకటనతో ఈ కాంబినేషన్ పై కూడా అనుమానాలు ఎక్కువయ్యాయి. మహేష్ కోసం జనగణమన అనే కథ రాసుకున్నాడు పూరి. కానీ ఆ ప్రాజెక్టు వర్కవుట్ అయ్యేది అనుమానమే. అది మాత్రమే కాదు, పూరి వ్యాఖ్యలతో మహేష్ ఇప్పట్లో అతడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు.


మహేష్-రాజమౌళి... సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ ఇది కూడా సాధ్యమయ్యే పనికాదని అనిపిస్తోంది. వీళ్లిద్దరి మధ్య చాలా ఏళ్ల కిందటే అభిప్రాయబేధాలొచ్చాయి. కానీ సుకుమార్, పూరి జగన్నాధ్ విషయంలో జరిగినట్టు అవి బయటకు మాత్రం రాలేదు. తను ఓ హీరోతో సినిమా చేయాలంటే ఆ హీరోకు, తనకు వేవ్-లెంగ్త్ (అభిప్రాయాలు) సెట్ అవ్వాలంటూ.. మహేష్ తో సినిమాపై పరోక్షంగా రియాక్ట్ అయ్యాడు రాజమౌళి. ఇది చాన్నాళ్ల కిందటి మాట. వీళ్లు మాత్రమేకాదు.. మహేష్ కు దూరమైన దర్శకుల జాబితాలో మణిరత్నం, గౌతమ్ మీనన్ కూడా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: