తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న జబర్ధస్త్ కామెడీ షోలో ఆడవారి పాత్రల్లో నటించి బాగా పాపులర్ అయిన వినోదిని అలియాస్ వినోద్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తాను ఉంటున్న ఇల్లు కొనుగోలు విషయంలో ఇంటి ఓనర్ ని నిలదీసినందుకు వినోద్ పై ప్లానింగ్ ప్రకారం హత్య చేయడానికి ప్రయత్నించారు.  అయితే అప్పటికే ప్రమాదాన్ని గమనించిన వినోద్ వారి నుంచి తప్పించుకొని బయటకు ఉరికిరావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 

వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తీవ్రంగా గాయపడ్డ వినోద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో  వినోద్ దాడి చేసిన నిందితులు హైదరాబాద్, నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.  వినోద్ పై దాడి చేసిన వారిలో ఇంటి యజమాని బాలాజీ, అతని భార్య ప్రమీల వారి కుమారులతో పాటు పెద్ద కోడలు ఉన్నారు.

ఈ కేసులో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎన్టీ అట్రాసిటీ చట్టంతో పాటు సెక్షన్ 324, 506 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితులంతా న్యాయమూర్తి ముందు హాజరు కావడంతో, ఆయన వారికి రిమాండ్ ను విధించారు. దీంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: